Site icon HashtagU Telugu

Shani Dev : శనిదేవుడు కలలోకి వస్తే…అదృష్టమా లేదా దురదృష్టమా..!

Shani Dev

Shani Dev

మనకు వచ్చే కలలకు ఓ ప్రత్యేక అర్థం ఉంటుంది. మన ఆలోచనలు, మన నిర్ణయాలను బట్టీ కలలు వస్తుంటాయి. కొన్ని కలలకు శనిదేవుడితో ప్రత్యక్ష సంబంధం ఉంటుంది. ఆ కలలు ఏమిటో శనిదేవుడి ప్రభావం ఎలా ఉంటుందో తెలుసుకుందాం.

మనం నిద్రపోయినప్పుడు ఏవో కలలు వస్తుంటాయి. వాటిలో కొన్ని గుర్తుంటాయి…కొన్ని గుర్తుండవు. కొన్ని పీడకలలు వచ్చి…నిద్రను చెడగొడతాయి. మరికొన్ని కలలు మనల్ని ఆలోచనలో పడేస్తుంటాయి. ఆ కల నాకు ఎందుకు వచ్చింది…దాని అర్థమేంటి…అని చాలామంది అనుకుంటారు. కలలో రెండు రకాలు ఉంటాయని చెబుతున్నారు స్వప్న నిపుణులు. గతంలో జరిగిన ఘటనల ఆధారంగా వచ్చేవి ఒకరకమైన కలలైతే…భవిష్యత్తులో జరగబోయే అంశాలపై వచ్చేవి రెండో రకమైన కలలు. కలలకు చాలా ప్రాముఖ్యత ఉంటుంది. అంతకుమించిన ఆసక్తి కలలపై ఉంటుంది.

జ్యోతిష్కులు, స్వప్నశాస్త్రనిపుణులు కలల సంజ్ణలకు ఎన్నో రకాల అర్థాలు ఉంటాయంటున్నారు. స్వప్నశాస్త్రం ప్రకారం కలలో మనం చూసే కొన్నివిషయాలు జీవితంలో నిజం అవుతుంటాయి. కొన్ని కలలకు శనిదేవుడితో ప్రత్యక్ష సంబంధం ఉంటుంది. ఆ కలలు ఏమిటో…శనిదేవుడి ప్రభావం ఎలాంటి తెలుసుకుందాం.

శనిదేవుడికి సంబంధించిన కలలు వస్తుంటే…మీ జీవితంలో ఏవో మార్పులు జరగబోతున్నాయని అర్ధం. శనిశ్వరుడు మీ పట్ల దయ చూపడం లేదా మీ పట్ల ఆగ్రహం వ్యక్తం చేయడానికి ఆ కలలు సంకేతం. కలలో శనిదేవుడి విగ్రహం లేదా చిత్రం కనిపించినట్లయితే…రాబోయే కాలం మీకు సుఖసంతోషాలు తీసుకోస్తుందని అర్ధం. అదే సమయంలో మీ జాతకంలో శని స్థానాన్ని బట్టి ఫలితాలు ఉంటాయి. కొంతమందికి శనిదేవుడి విగ్రహం కలలో వస్తే ఇబ్బందులు ఎదురుకావొచ్చు.

ఇక కలలో శనీశ్వరుడు నేరుగా వచ్చి అనుగ్రహించినట్లయితే…ఆ కల చాలా శుభప్రదమైంది. శనిదేవుడు మీ జీవితంలోని అన్ని కష్టాలను తొలగిస్తాడని అర్థం. అనారోగ్య సమస్యలతో, ఆర్థిక ఇబ్బందులతోపాటు ఇతర సమస్యలతో బాధపడేవారికి శనిదేవుడు కలలో వస్తే వారి సమస్యలన్నీ తొలగిపోతాయి. కలలో శనిదేవాలయం కనిపిస్తే…శుభప్రదమని చెబుతున్నారు జ్యోతిష్కులు. ఆ వ్యక్తులు శనిదేవుని అనుగ్రహాన్ని పొందబోతున్నారని అర్థమట. అంతేకాదు ధన లాభానికి కూడా సంకేతమట. కొన్ని కీలక పనుల్లో విజయంసాధిస్తారని సంకేతమట.