Meals: పళ్లెంలో భోజనం మన కోసం ఎందుకు ఎదురు చూడకూడదో తెలుసా?

ఈ రోజుల్లో చాలామంది పనులు, ఆఫీస్ అంటూ బిజీ బిజీ లైఫ్ ని గడుపుతున్నారు. ఈ బిజీ లైఫ్ కారణంగా కనీసం కంటినిండా నిద్ర, ఆహారం కూడా తిన లేకపోతున్

  • Written By:
  • Publish Date - August 17, 2023 / 09:30 PM IST

ఈ రోజుల్లో చాలామంది పనులు, ఆఫీస్ అంటూ బిజీ బిజీ లైఫ్ ని గడుపుతున్నారు. ఈ బిజీ లైఫ్ కారణంగా కనీసం కంటినిండా నిద్ర, ఆహారం కూడా తిన లేకపోతున్నారు. చాలామంది భోజనం సమయంలో భోజనం తినేటప్పుడు తెలిసి తెలియక కొన్ని రకాల తప్పులు చేస్తూ ఉంటారు. అందులో ముఖ్యంగా ఇంట్లో తల్లులు భార్యలు భోజనం వడ్డించి ఎంతసేపు పిలిచినా కూడా రాకుండా అలాగే బద్ధకంగా ప్రవర్తిస్తూ ఉంటారు. మనకోసం ఎప్పుడూ కూడా పల్లెలో భోజనం ఎదురు చూడకూడదట. అందుకే ఎవరైనా భోజనానికి వచ్చేముందు వారు భోజనానికి వచ్చిన తర్వాత అప్పుడు విస్తరిలో లేదా పళ్లెంలో భోజనం వడ్డించాలి.

కానీ ముందుగానే భోజనం వడ్డించి మనిషి వచ్చేవరకు ఎదురు చూడకూడదు. ఎందుకంటే అన్నం కోసం మనం ఎదురుచూడాలి కానీ, మనకోసం అన్నం ఎదురుచూడకూడదు. అలా చేస్తే భవిష్యత్తులో దరిద్రం అంటే అవకాశం ఎక్కువ. తూర్పునకు ముఖం పెట్టి భోజనం చేయడం ఎక్కువ ప్రాముఖ్యం ఉంది. ఎందుకంటే అలా కూర్చొని తినడం వల్ల దీర్ఘాయుష్షు వస్తుంది. తూర్పు దిక్కు ఇంద్రునికి ఆధిపత్యస్థానము, సూర్యునికి నివాస స్థానం ఉండటం వలన ప్రాధాన్యమెక్కువ. పడమర ముఖంగా కూర్చుంటే బలం వస్తుంది. ఉత్తర ముఖంగా కూర్చుంటే సంపద వస్తుంది. దక్షిణ ముఖంగా కూర్చుంటే కీర్తి వస్తుంది.

అన్నము తింటున్నప్పుడు అన్నమును, ఆ అన్నము పెట్టువారిని తిట్టుట, దుర్భాషలాడుట చేయరాదు. ఏడుస్తూ తింటూ, గిన్నె/ ఆకు మొత్తం ఊడ్చుకొని తినడం పనికిరాదు. దెప్పి పొడువరాదు. ఎట్టిపరిస్థితిలో అయినా ఒడిలో పళ్ళెము పెట్టుకుని అన్నం తినరాదు. ఇది చాలా దరిద్రము. భోజన సమయంలో నవ్వులాట, తగువులాట, తిట్టుకొనుట, గేలిచేయుట నష్టదాయకం. అదేవిధంగా మనం భోజనం చేసేటప్పుడు మొదటి ముద్ద గోమాతకి చివరి ముద్ద కుక్కకి పెట్టడం మంచిది.