ఇతర దేశాలతో పోల్చుకుంటే భారతదేశంలో లక్షల్లో ఆలయాలు ఉన్నాయి అన్న విషయం మనందరికీ తెలిసిందే. ఇండియాలో ఆలయాలకు కొదవే లేదు అని చెప్పాలి. ఒక్కొక్క గుడి కూడా ఒక ప్రాధాన్యతను విశిష్టతను కలిగి ఉంది. అదేవిధంగా ఒక్కో ప్రదేశంలో ఉండే దేవతలు దేవుళ్ళు ప్రత్యేక శక్తులను మహిమలను కలిగి ఉన్నారు. అటువంటి వాటిలో హైదరాబాదులో దగ్గర్లో ఉన్న ఆలయం కూడా ఒకటి.. హైదరాబాద్ సమీపంలోని శంకరపల్లి దగ్గరలో చండిప్పలోని శ్రీ మరకత శివలింగ సోమేశ్వర స్వామి దేవాలయం చాలా ఫేమస్ అని చెప్పాలి.
అయితే ఇందుకు గల కారణం ఈ ఆలయంలో మరకత శివలింగం ప్రతిష్ఠించబడి ఉంది. ఈ ఆలయం చాలా పురాతనమైనది. క్రీ.శ. 1076 నుండి 1126 మధ్యకాలంలో పశ్చిమ చాళుక్య రాజైన విక్రమాదిత్య పరిపాలించిన సమయంలో ఈ ఆలయం నిర్మించబడినట్లు సమాచారం. క్రీ.శ. 1101 అక్టోబర్ 23న సోమేశ్వర లింగం ప్రతిష్ఠించబడింది. కాలభైరవుడు ఒక దివ్య,మైన పాము ఈ ఆలయానికి క్షేత్రపాలకులని నమ్ముతారు. కాలక్రమేణా ఈ ఆలయం శిథిలావస్థకు చేరుకుంది. అయితే 2007లో నరేష్ కుమార్ అనే భక్తుడు దీనిని పునరుద్ధరించడానికి పూనుకున్నారని 2012లో ఆలయాన్ని తిరిగి నిర్మించారని సమాచారం. ఈ ఆలయంలోని మరకత శివలింగం చాలా అరుదైనది, దీనిని పూజించడం చాలా శుభప్రదంగా భావిస్తారు.
మరకతం అంటే బుద్ద గ్రహానికి చెందిన రంగు. పురాణాల ప్రకారం మరకత శివలింగాన్ని పూజించడం వలన కష్టాలు, పాపాలు తొలగిపోతాయని నమ్మకం. ఈ లింగానికి అభిషేకం చేయడం, గంధం రాయడం వలన ఔషధ గుణాలు ఉంటాయని నమ్మకం. శంకరపల్లి వెళ్ళినప్పుడు ఈ అరుదైన మరకత శివలింగాన్ని దర్శించుకోవడం ఒక ప్రత్యేకమైన అనుభూతినిస్తుంది. ఈ ఆలయాన్ని దర్శిస్తే అష్ఠదరిద్రాలన్నీ పోతాయని చెబుతాట. ఆలయంలో ఒక రాయి ఉంటుంది. దానిపై రెండు చేతుల బొటనవేళ్లు పెట్టి ఏదైనా కోరిక కోరుకుంటే అది నెరవేరే కోరిక అయితే ఆ రాయి దానంతట అదే కుడివైపుకు తిరుగుతుందట. ఇప్పటికే ఇందుకు సంబంధించిన వీడియోలను తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. తమ కోరికలు ఇక్కడ కోరుకున్న తర్వాత నెరవేరాయని చాలామంది భక్తులు చెబుతే ఆ వీడియోల కింద కామెంట్స్ కూడా పెడుతున్నారు. మరి ఇంకెందుకు ఆలస్యం వెంటనే ఈ ఆలయాన్ని సందర్శించి మీ కష్టాలను తీర్చుకోండి.