Mohini Plant: ఇంట్లో మోహిని మొక్క పెంచుకుంటే ఏం జరుగుతుందో తెలుసా?

సాధారణంగా చాలామంది ఇంటిదగ్గర అనేక రకాల మొక్కలను పెంచుకుంటూ ఉంటారు. అయితే కొందరు ఇంటి

  • Written By:
  • Publish Date - February 20, 2023 / 06:00 AM IST

సాధారణంగా చాలామంది ఇంటిదగ్గర అనేక రకాల మొక్కలను పెంచుకుంటూ ఉంటారు. అయితే కొందరు ఇంటి అలంకరణ కోసం కొన్ని రకాల మొక్లను ఇండ్లలో కూడా పెంచుకుంటూ ఉంటారు.. మనీ ప్లాంట్,క్రాసులా వంటి మొక్కలను ఎక్కువగా పెంచుకుంటూ ఉంటారు. అయితే క్రాసులా మొక్కను చాలా తక్కువ మంది మాత్రమే ఇంటి దగ్గర నాటుతూ ఉంటారు. ఇకపోతే మరి మన ఇంటి ఆవరణ ప్రాంతంలో మోహిని మొక్క నాటుకోవడం వల్ల ఏం జరుగుతుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. ఈ మొక్కను మన ఇంట్లో లేదా ఆఫీసులలో పెట్టుకోవడం వల్ల ఆర్థిక సమస్యలు తొలగుతాయి.

కాగా ఈ మొక్కకు ఎండ నీడ అనే తేడా ఉండదు. ఇంటి లోపల కూడా బాగా పెరుగుతాయి. వాస్తు ప్రకారం ఈ మొక్క ఇంట్లో ఉంటే అదృష్టం వరిస్తుంది. ఈ మొక్కకు నీరు కూడా ఎక్కువ అవసరం లేదు. చాలా కాలం బతుకుతుంది. ఇంట్లో వేడి ఎక్కువగా ఉంటే చల్లదనం కోసం మోహిని మొక్కను పెంచుకోవచ్చు. ఈ మొక్కను ఇంట్లో పెంచుకోవడం వల్ల ఇంట్లోని గోడలపై ఉన్న బ్యాక్టీరియాను ఈ మొక్క అబ్జర్వ్ చేసుకుంటుంది. కీటకాలు, పురుగులు ఈ మొక్క వలన దూరం అవుతాయి. డయాబెటిస్ బాధితులు ఈ మొక్క ఆకులను నీళ్లలో వేడి చేసి తాగితే మంచి ఫలితం కనిపిస్తుంది.

మోహినీ మొక్కను మనీ ప్లాంట్ అని కూడా పిలుస్తుంటారు.కాగా దీనిని ఇంట్లో ఆగ్నేయ మూలలో ఉంచాలి లేదా తూర్పు దిశలో పెట్టాలి. ఈ మోహిని మొక్కను ఇంట్లో పైన సూచించిన విధంగా మూలల్లో ఉంచడం వల్ల మంచి ఫలితాలు కనిపిస్తాయి. అంతేకాకుండా ఈ మొక్క ఇంట్లో ఉన్న నెగటివ్ ఎనర్జీ తీసుకొని పాజిటివ్ ఎనర్జీని విడుదల చేస్తూ ఉంటుంది.. అంతేకాకుండా ఈ మొక్క ఉన్న ప్రదేశంలో కలహాలు గొడవలు లేకుండా మనశ్శాంతిగా ఉంటారు. కొన్ని ప్రదేశాలలో మోహిని మొక్కను మనీ ప్లాంట్ అని కూడా పిలుస్తూ ఉంటారు.