Vastu Tips for Tulsi: తులసి ఆకులను తుంచడానికి నియమాలు పాటించాలని మీకు తెలుసా?

హిందువులు తులసి మొక్కను పరమపవిత్రంగా భావించడంతో పాటు నిత్యం భక్తిశ్రద్ధలతో పూజలు చేస్తూ ఉంటారు. ప్రత్యేకించి కొన్ని కొన్ని సందర్భాలలో తులసిక

  • Written By:
  • Publish Date - February 1, 2024 / 10:00 PM IST

హిందువులు తులసి మొక్కను పరమపవిత్రంగా భావించడంతో పాటు నిత్యం భక్తిశ్రద్ధలతో పూజలు చేస్తూ ఉంటారు. ప్రత్యేకించి కొన్ని కొన్ని సందర్భాలలో తులసికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తూ ఉంటారు. తులసి మొక్కలో లక్ష్మీదేవి విష్ణువు కొలువై ఉంటారు. కాబట్టి తులసి మొక్కను పూజిస్తే లక్ష్మీ విష్ణువు అనుగ్రహంతో పాటు తులసి దేవి అనుగ్రహం కూడా లభిస్తుందని భక్తులు విశ్వసిస్తూ ఉంటారు. అయితే తులసి మొక్కను పూజించడం మంచిదే కానీ తులసి మొక్క విషయంలో పూజ చేసే సమయంలో తెలిసి తెలియక కొన్ని రకాల తప్పులు చేయకూడదు. అలాగే తులసి మొక్క నుంచి ఆకులను తెంచే విషయంలో కూడా కొన్ని రకాల నియమాలను తప్పకుండా పాటించాలి.

మరి తులసి ఆకులను తెంపేటప్పుడు ఎలాంటి నియమాలు పాటించాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. తులసి ఆకులను మొక్క నుంచి తెంచడానికి సరైన సమయం బ్రహ్మ ముహూర్తంగా పరిగణించబడుతుంది. తులసి ఆకులను తీయడానికి ముందు స్నానం చేసి మీకు ఇష్టమైన దేవుడిని పూజించాలి. అనంతరం తులసికి పూజ చేయాలి. ఆకులను తీయడానికి తులసి మొక్క అనుమతి తీసుకోవాలి. ఒకేసారి గరిష్టంగా 21 ఆకులను మాత్రమే తెంచాలి. ఇలా చేయడం వల్ల తులసి ఆశీస్సులు ఎల్లప్పుడూ మీతోనే ఉంటాయి. తులసి ఆకులను ఎలా బడితే అలా ఏ సమయంలో బడితే ఆ సమయంలో తెంచరాదు.

సనాతన ధర్మంలోని నమ్మకాల ప్రకారం తులసి ఆకులను మొక్క నుంచి తెంచడానికి ముందు తులసి మాతను ప్రార్ధించి ఆకులను కావాల్సినంత వరకు మాత్రమే తీసుకుంటానని అందుకు మీ అనుమతి ఇవ్వండి అంటూ కోరుకోవాలి. అయితే తులసి ఆకులను తెంచడానికి ముందు ఒక మంత్రాన్ని జపించాలి. అనంతరం తులసి ఆకులను తెంపవచ్చు. ఇలా చేయడం వల్ల లక్ష్మీదేవి సంతోషిస్తుంది. ఇంతకీ ఆ మంత్రం ఏంటి అన్న విషయానికి వస్తే.. ఓ తులసీ మాతా, ఓ గోవిందా, నీవు హృదయానికి ఆనందాన్ని కలిగిస్తున్నావు నారాయణుడిని ఆరాధించడానికి నేను నిన్ను ఎన్నుకున్నాను, కనుక నీ ఆకులు తీసుకునేందుకు అనుమతినివ్వు మీకు నా ప్రణామాలు అంటూ తులసి ఆకులను తీయడానికి ముందు మంత్రాన్ని జపించాలి. తులసి ఆకులను తెంచినప్పుడు మాతా తులసి గోవింద హృదయానంద కారిణి నారాయణస్య పూజార్థం చినోమి త్వాం । _ మతసత్తుల్సీ గోవింద్ హృదయానందకారిణి అంటూ ఈ మంత్రాన్ని 21 సార్లు జపించాలి. 21 ఆకులను మాత్రమే తీసుకోవాలి.