మామూలుగా చాలామంది ఎంత సంపాదించినా కూడా చేతిలో చిల్లి గవ్వ మిగలడం లేదని అంటూ ఉంటారు. అందుకు గల కారణం రుణ బాధలు ఆర్థిక సమస్యలు. ఈ వీటికి వాస్తు ప్రకారం గానే కాకుండా గ్రహాలు అనుకూలించని సమయంలో కూడా ఈ రుణ బాధలు ఇబ్బంది పెడుతూ ఉంటాయి. అంటే ఒక్క అప్పు తీర్చడానికి ఇంకొక అప్పు చేయవలసి వస్తూ ఉంటుంది. ఇలాంటి సమస్యలతో బాధపడేవారు మంగళవారం రోజు కొన్ని రకాల పరిహారాలు పాటిస్తే సమస్యలు తప్పకుండా తీరతాయని చెబుతున్నారు. మరి మంగళవారం రోజు ఎలాంటి పరిహారాలు పాటించాలి అన్న విషయానికి వస్తే..
మంగళవారానికి కుజుడు అధిపతి. మనకు రుణ బాధలు పెరగడానికి కానీ తొలగిపోవడానికి కుజుడే కారణం. అందుకే కుజ అనుగ్రహం కోసం మంగళవారం రోజు కొన్ని రకాల పరిహారాలు పాటించాలని చెబుతున్నారు. మంగళవారం నవగ్రహాలలో కుజునికి దానిమ్మ పండు రసంతో అభిషేకం చేయిస్తే రుణ బాధలు తొలగిపోతాయట. అలాగే కుజ గ్రహానికి ఎరుపు రంగు పూలతో అష్టోత్తర శతనామాలతో పూజ జరిపించి ఎర్ర వస్త్రం సమర్పించాలట. మంగళవారం ఎర్రని కందులు అంటే ముడి కందులు బ్రాహ్మణులకు దానంగా ఇవ్వడం వలన కూడా అప్పుల బాధలు తొలగిపోతాయని చెబుతున్నారు. అలాగే మంగళవారం సుబ్రహ్మణ్యస్వామికి అభిషేకం, అర్చనలు జరిపించడం కూడా మంచిదని చెబుతున్నారు.
కాగా మంగళవారం ఆంజనేయస్వామి ఆలయంలో స్వామి సమక్షంలో మల్లెనూనెతో దీపారాధన చేయడం వలన అప్పుల తిప్పలు తొలగిపోతాయట. అయితే వాస్తుశాస్త్రం ప్రకారం మంగళవారం అప్పు ఇవ్వకూడదు. పొరపాటున కూడా మంగళవారం రోజున ఎవరి దగ్గరా అప్పులు తీసుకోవద్దని, అప్పు ఇవ్వొద్దని అంటారు. ఒకవేళ మంగళవారం అప్పులు తీసుకున్న, ఇచ్చినా ఆర్థిక పరిస్థితి మరింత దిగజారుతుందట. పైగా డబ్బుకు కొరత ఏర్పడుతుందని చెబుతున్నారు. తరచుగా ఆర్థిక సమస్యలు, అప్పులతో ఇబ్బంది పడుతుంటే మంగళవారం 21 సార్లు.. ఓం హం హనుమతే నమః అనే మంత్రాన్ని జపిస్తే ఆర్థిక సమస్యలు దూరమవుతాయని చెబుతున్నారు. అప్పుల బాధలు తీరడానికి మంగళవారం సీతారాముల సమేతంగా హనుమంతుని పూజించాలట. అలాగే శ్రీరామరక్షా స్తోత్రాన్ని పఠించాలని చెబుతున్నారు. ఇక రుణ విముక్తి కోసం మంగళవారం రోజున హనుమంతుని ఆలయానికి వెళ్లి స్వామిని దర్శించుకుని 11 సార్లు హనుమాన్ చాలీసా పారాయణ చేయడం వలన సత్ఫలితాలు ఉంటాయని చెబుతున్నారు.