Male Bath: మగవాళ్ళు ఆ సమయంలో స్నానం చేస్తే దరిద్రం చుట్టుకుంటుందా.. అశుభమా?

మామూలుగా రోజు స్నానం చేయడం అన్నది ఒక మంచి అలవాటు. ప్రతిరోజు స్నానం చేయడం వల్ల ఎన్నో రకాల ప్రయోజనాలు కలుగుతాయి. రోజుకు రెండుసార్లు స్నా

  • Written By:
  • Publish Date - February 15, 2024 / 12:00 PM IST

మామూలుగా రోజు స్నానం చేయడం అన్నది ఒక మంచి అలవాటు. ప్రతిరోజు స్నానం చేయడం వల్ల ఎన్నో రకాల ప్రయోజనాలు కలుగుతాయి. రోజుకు రెండుసార్లు స్నానం చేసే వారు కూడా ఉన్నారు. శరీరాన్ని ఎంత శుభ్రంగా ఉంచుకుంటే రోగాలు అనారోగ్య సమస్యలు కూడా అంత దూరంగా ఉంటాయి. అయితే స్నానం చేయడం మంచిదే కదా అని ఎప్పుడు పడితే అప్పుడు స్నానం చేయకూడదు అంటున్నారు పండితులు. వీలైనంతవరకు ఉదయమే స్నానం చేయడం మంచిదని చెబుతున్నారు. ఉదయం 6 గంటలకు స్నానం చేస్తే ఇంకా మంచిదట. తెల్లవారుజామున స్నానం చేస్తే దేవతా స్నానం అంటారు. ఉదయం ఎనిమిది గంటల లోపు స్నానం చేస్తే మంగళ స్నానమని అంటారు.

అలాగే సాయంత్రం స్నానం చేయడం కూడా మంచిదే. అంటే ఉదయం చేయకుండా సాయంత్రం స్నానం చేయమని అర్థం కాదు. ఉదయం సాయంత్రం స్నానం చేస్తే మంచిది. సాయంత్రం స్నానం చేయడం వల్ల ప్రశాంతంగా నిద్ర పోవచ్చు. ఉదయాన్నే స్నానం చేస్తే బలం తేజస్సు పెరిగి ఆయురారోగ్యాలు ప్రసాదిస్తుంది. కొందరు భోజనం చేసిన వెంటనే స్నానం చేస్తారు. ఇలా అన్ని శరీర అంగాలు అన్ని తరిసే విధంగా స్నానం చేయాలట. చల్లని నీటితో స్నానం రోగనిరోధకతను పెంచుతుంది. రెగ్యులర్గా చల్లటి నీటి స్నానం చేస్తే మన శరీరంలో రోగాలతో పోరాడి తెల్ల రక్త కణాల సంఖ్య పెరుగుతుంది. దాని ఫలితంగా రోగనిరోధక శక్తి పెరుగుతుంది. చల్లని నీటితో స్నానం సాధారణ జలుబును నివారిస్తుంది.

చాలామంది మిట్టమధ్యాహ్నం అలాగే రాత్రి ఎనిమిది గంటల తరువాత ఇలా ఎప్పుడు పడితే అప్పుడు స్థానం చేస్తూ ఉంటారు. కానీ అలా అసలు చేయకూడదట. సమయం లేక పోయినప్పటికీ కాస్త సమయాన్ని కుదుర్చుకొని ఉదయం సాయంత్రం స్నానం చేయడం చాలా మంచిది అంటున్నారు. అయితే ఇలా మధ్యాహ్నం సమయంలో రాత్రి సమయంలో స్నానం చేయడం ఆధ్యాత్మికంగానే కాకుండా ఆరోగ్యపరంగా కూడా మంచిది కాదట. మధ్యాహ్నం రాత్రి సమయంలో చేస్తే దరిద్రం చుట్టుకుంటుంది అంటున్నారు పండితులు.