Silver Vastu Tips: వెండితో మీ జీవితం బంగారమయం.. ఎలా అంటే?

ఆర్థిక సమస్యల నుంచి బయటపడడానికి, జీవితాన్ని బంగారం మయం చేసుకోవడానికి వాస్తు శాస్త్రంలో ఎన్నో రకాల

Published By: HashtagU Telugu Desk
Silver Prices

Silver Prices

ఆర్థిక సమస్యల నుంచి బయటపడడానికి, జీవితాన్ని బంగారం మయం చేసుకోవడానికి వాస్తు శాస్త్రంలో ఎన్నో రకాల పరిహారాలు చెప్పబడ్డాయి. అయితే అదృష్టాన్ని సానుకూల శక్తిని ఆకర్షించడంలో వెండిని అనేక విధాలుగా ఉపయోగించవచ్చు. మరి వెండిని ఏ విధంగా ఉపయోగించడం వల్ల జీవితం బంగారు మయమవుతుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. వాస్తు శాస్త్ర ప్రకారం వెండి చంద్రుడు బృహస్పతి తో సంబంధం కలిగి ఉంటుంది. వెండి ఆభరణాలు ధరించడం వల్ల అనేక రకాల ఆరోగ్య ప్రయోజనాలు కూడా ఉన్నాయి. అంతేకాకుండా అనేక వాస్తు సంబంధిత దోషాలను సరి చేయడానికి ఎప్పుడు వెండినే ఉపయోగిస్తూ ఉంటారు.

వెండి నగలు అదృష్టాన్ని శాంతిని సామర్ధ్యాన్ని ఆకర్షిస్తాయి. అంతేకాకుండా ఇవి ఇంటి సభ్యుల ఆదాయాన్ని పెంచడం మాత్రమే కాకుండా ఎల్లప్పుడూ ఇంట్లో డబ్బు ఉండే విధంగా చూస్తాయి. వెండి తాబేలు లేదంటే వెండి చేప ను మీ ఇంట్లో ఉంచుకోవచ్చు. ఈ విధంగా చేయడం వల్ల ఆ ఇంట్లో ఆనందం శ్రేయస్సు లభిస్తుంది. ఇంట్లో ఉన్న వాస్తు దోషాలను తొలగించడం కోసం ఇంటి ప్రధానముఖ ద్వారం వద్ద వెండిని వేలాడదీయాలి. పిండి ఆభరణాలు ధరించడం లేదంటే ఇంట్లో వెండి పాత్రలు ఉంచడం శుభప్రదం అని చెప్పవచ్చు. మరి ముఖ్యంగా పవిత్రమైన పూజలో వెండి పాత్రలను ఉపయోగించడం ఎంతో మంచిది. ఆకర్షించడం కోసం నీటితో నింపిన రెండు వెండి గిన్నెలలో ఒక జత వెండి చేపలను ఉంచాలి.

అదేవిధంగా వెండి నాణేలను దిండు కింద ఉంచడం వల్ల బుధుడు లేదా అంగారకుడి ప్రభావం వల్ల కలిగే దురదృష్టం తొలగిపోతుంది. అలాగే వెండి నాణేలను వాలెట్లో ఉంచుకోవడం లక్ష్మీ అనుగ్రహం లభిస్తుంది. ఎంత ప్రయత్నించినా డబ్బులు చేతిలో మిగిలడం లేదు అని బాధ పడేవారు ఇంట్లో ఒక పెద్ద గాజు పాత్రను ఉత్తరం వైపు ఉంచి ఇందులో వెండి నాణెం ను వేయాలి. అలాగే ఉత్తర దిశలో వెండి తాబేలు ఉంచడం ద్వారా మంచి ఫలితాలు వస్తాయి. అదేవిధంగా వెండితో చేసిన వినాయకుడు లక్ష్మీదేవి విగ్రహాలను ఈశాన్యంలో ఉంచి పూజించాలి. అలాగే వ్యాపార రంగంలో అభివృద్ధిని కోరుకునే వారు ఇంట్లో వెండి ఏనుగును పెట్టుకోవాలి. అలాగే ఆర్థిక సమస్యలను ఎదుర్కొంటున్న వారు పనిలో ఎన్నో రకాల అడ్డంకులను ఎదుర్కొంటున్న వారు జేబులో ఒక చదరపు వెండి ముక్కను ఉంచుకోవాల .

  Last Updated: 23 Dec 2022, 08:35 PM IST