Site icon HashtagU Telugu

Goddess Lakshmi : ఈ నైవేద్యాన్ని లక్ష్మీదేవికి పెట్టండి…మీ ఇంట్లో డబ్బే డబ్బు…!!

New year wealth

goddesses lakshmi

కొంతమందికి ఎంత డబ్బు సంపాదించినా…చేతిలో చిల్లిగవ్వ కూడా మిగలడంలేదని బాధపడుతుంటారు. చాలా వరకు ఖర్చులను తగ్గించుకున్నా…ఏదోక రూపంలో డబ్బులు ఖర్చు అవుతుంటాయి. జీవితంలో ఆర్థికంగా బాగా స్ధిరపడాలన్నా డబ్బులు బాగా సంపాదించాలన్నామనపై లక్ష్మీ దేవి అనుగ్రహం తప్పకుండా ఉండాలి. మరి డబ్బులు నిలబడాలంటే లక్ష్మీ దేవికి ఏవిధంగా పూజచేయాలి…ఎలాంటి నైవేద్యాన్ని సమర్పించాలో తెలుసుకుందాం.

చాలామంది జీవితంలో స్థిరపడాలని కష్టపడి డబ్బు సంపాదించినప్పటికీ…అనుకోని విధంగా డబ్బులు ఎక్కువ మొత్తంలో ఖర్చు అవుతుంటాయి. వారు పడిన కష్టానికి ఫలితం దక్కదు. దీంతోవారునిరాశ చెందుతుంటారు. ఒక రకంగా చెప్పాలంటే…డబ్బు నిలవకపోవడానికి అనారోగ్య సమస్యలు కూడా ముఖ్య కారణం అని చెప్పవచ్చు. కాబట్టి ఆరోగ్యంగా ఉండాలన్నా సంపాదన నిలవాలన్నా లక్ష్మీదేవిని తప్పకుండా పూజించాలి. లక్ష్మీదేవిని పూజించి ఆమె అనుగ్రహం పొందినట్లయితే ఆర్థికంగానే కాదు…ఆరోగ్యపరంగానూ బాగుంటారు.

ఇక లక్ష్మీదేవి అనుగ్రహం కోసం సోమవారం రోజు తలస్నానం చేసి సూర్యోదయం సమయంలో అంటే ఆరు నుంచి ఏడు గంటలలోపు పెరుగు చెక్క కవ్వంతో చిలికిన వెన్ను తీయాలి. పెరుగును చిలకేందుకు చెక్క కవ్వం మాత్రమే ఉపయోగించాలి. అప్పుడే లక్ష్మీదేవి అనుగ్రహం పొందుతారు. అలా తయారు చేసుకున్న ఆ వెన్నను పాడవకుండా జాగ్రత్తగా భద్రపరచుకోవాలి. శుక్రవారం రోజు ఉదయాన్నే తలస్నానం చేసి ఇంటిని శుభ్రపరిచి లక్ష్మీదేవికి పూజ చేయాలి. పూజ చేసిన తర్వాత ముందుగా సిద్ధం చేసుకున్న ఆ వెన్నలో పొడిపట్టిక బెల్లాన్ని కలిపి లక్ష్మీదేవికి నైవేద్యంగా సమర్పించాలి. ఇలా చేసిన తర్వాత ఆ నైవేద్యాన్ని ఇంట్లో పిల్లలకు ప్రసాదంగా ఇవ్వాలి. ఇలా 11 వారాలు చేస్తే…లక్ష్మీదేవి సంతోషంతో మనపై అనుగ్రహం చూపిస్తుందని పండితులు చెబుతున్నారు.