Site icon HashtagU Telugu

Sankranti – Horoscope : ఇవాళే మకర సంక్రాంతి.. నేటి రాశిఫలాలివీ..

Makar Sankranti

Makar Sankranti

మేష రాశి 

Sankranti – Horoscope : మీ కార్యాలయంలో ఏదైనా మార్పు జరగొచ్చు. పనిలో ఎదురయ్యే సవాళ్లను ఆత్మవిశ్వాసంతో ఎదుర్కొంటారు.వాహన నిర్వహణకు డబ్బులు ఖర్చు చేయాల్సి  రావచ్చు. పిల్లల ఆరోగ్యం గురించి మనస్సు కలత చెందుతుంది. ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది.

వృషభ రాశి

మీ కార్యాలయంలో పెద్ద మార్పులు ఉంటాయి. కోపం, ఆవేశంలో ఎలాంటి నిర్ణయం తీసుకోకండి. మీరు కార్యాలయంలోని ఉన్నతాధికారుల నుంచి మద్దతు పొందుతారు. ఉద్యోగంలో ప్రమోషన్‌ వచ్చే అవకాశం ఉంది. వాహన నిర్వహణకు ధనాన్ని ఖర్చు చేస్తారు.

మిథున రాశి 

చాలా కాలంగా పెండింగ్‌లో ఉన్న పనులు విజయవంతమవుతాయి. మీ సామర్థ్యాలను ఉపయోగించి సమస్యలను పరిష్కరించుకోవాలి. కొత్త ప్రణాళికలు వేసుకుంటారు. కుటుంబ సభ్యుల నుంచి మద్దతు లభిస్తుంది. ఆదాయం పెరగడానికి కొత్త మార్గాలు సుగమం(Sankranti – Horoscope) అవుతాయి.

We’re now on WhatsApp. Click to Join.

కర్కాటక రాశి

తెలియని భయం వల్ల మీ మనస్సు కలత చెందుతుంది. పిల్లల వైపు నుంచి ఇబ్బందులు ఉండొచ్చు. భావోద్వేగాలకు దూరంగా ఉండండి.  ఆస్తి నిర్వహణ కోసం డబ్బు ఖర్చు చేయాల్సి రావచ్చు. ఈరోజు మీరు మీ సోదరుడు లేదా సోదరికి ఆర్థికంగా సహాయం చేయాల్సి రావొచ్చు. కోర్టు కేసులలో విజయం ఉంటుంది.

సింహ రాశి 

ఈ రోజు తక్కువ ఆదాయం  ఎక్కువ ఖర్చులు ఉంటాయి. ఉద్యోగ రీత్యా ప్రయాణం చేయవలసి రావచ్చు. కష్టపడి పని చేయాలి. కోపాన్ని నియంత్రించుకోవాలి. కొత్త బాధ్యతలు స్వీకరించేందుకు సిద్ధంగా ఉండాలి. కొత్త ఆదాయ వనరులు ఏర్పడతాయి.

కన్యా రాశి  

పిల్లల ఆరోగ్యం గురించి ఆందోళన చెందుతారు. కొత్త ఆదాయ వనరుల ద్వారా ఆర్థిక లాభాలు ఉంటాయి. పాత మిత్రులను కలుస్తారు. అనారోగ్య సమస్యల నుంచి ఉపశమనం పొందుతారు. ఉద్యోగ, వ్యాపారాలకు వాతావరణం అనుకూలంగా ఉంటుంది.

Also Read: Prajapalana Update : ప్రజాపాలనలో దరఖాస్తులు ఇచ్చారా ? కొత్త అప్‌డేట్ ఇదే

తులా రాశి

జీవిత భాగస్వామితో విభేదాల సంకేతాలు ఉన్నాయి. మాటలో కర్కశత్వం రానివ్వొద్దు. హఠాత్తుగా ఎలాంటి నిర్ణయం తీసుకోకూడదు. కుటుంబ సంబంధాలపై ప్రత్యేక శ్రద్ధ వహించాలి. మీ జీవనశైలి అస్తవ్యస్తంగా ఉంటుంది. ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి.  కార్యాలయంలో మార్పులు ఉండొచ్చు.

వృశ్చిక రాశి 

చాలా కాలంగా నిలిచిపోయిన డబ్బు తిరిగి వస్తుంది. కానీ ప్రణాళికేతర ఖర్చులు పెరుగుతాయి.తల్లి ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి. ధన ప్రవాహానికి కొత్త మార్గాలు సుగమం అవుతాయి. కుటుంబ సభ్యుల నుంచి మద్దతు లభిస్తుంది. ఉద్యోగ, వ్యాపారాలకు వాతావరణం అనుకూలంగా ఉంటుంది.

ధనుస్సు రాశి  

ఆర్థిక విషయాలలో కొత్త సవాళ్లను స్వీకరించడానికి ఇది ఉత్తమ సమయం. కొత్త పెట్టుబడులకు అనుకూలమైన సమయమే.. కానీ తొందరపడి డబ్బుకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోకండి.  దీర్ఘకాలిక పెట్టుబడుల గురించి ఆలోచించండి.

మకర రాశి

కుటుంబ బంధాల విషయంలో నిర్లక్ష్యంగా ఉండొద్దు. వారి భావాలకు విలువనివ్వండి. డబ్బుకు సంబంధించి చిన్న చిన్న సమస్యలు ఉంటాయి. కష్టపడి పని చేయాలి. ఉద్యోగాల కోసం వెతుకుతున్న వారికి ఈరోజు ఇంటర్వ్యూకు కాల్ రావచ్చు.

కుంభ రాశి

మీ కార్యాలయంలో అనవసర వాదనలకు దూరంగా ఉండండి. కొంతమంది ఈరోజు ఉద్యోగాలు మారొచ్చు. మరికొంతమంది పదోన్నతికి సంబంధించిన సమాచారం వింటారు. మీ వ్యక్తిగత, వృత్తి జీవితంలో సమతుల్యతను కాపాడుకోవడానికి ప్రయత్నించండి. ఇది మీ ఒత్తిడిని తగ్గిస్తుంది.

మీన రాశి 

ఈరోజు మీ మనసుని ఓ విషయం బాధపెడుతుంది. జీవితంలో పెద్ద మార్పులకు సిద్ధంగా ఉండండి. పని బాధ్యతలను చాలా జాగ్రత్తగా నిర్వహించండి. మీ లక్ష్యాలను సాధించేందుకు మరింత కష్టపడాల్సి ఉంటుంది. వ్యాపారులకు అనుకూలమైన రోజు.

Exit mobile version