Site icon HashtagU Telugu

Mahashivaratri 2025: మహాశివరాత్రి పండుగ ఎందుకు జరుపుకుంటారు.. దీని వెనుక ఉన్న కారణం ఏంటో మీకు తెలుసా?

Mahashivaratri 2025

Mahashivaratri 2025

పరమేశ్వరుడికి మహాశివరాత్రి పండుగ అంటే చాలా ఇష్టం. ప్రతినెల శివరాత్రి వస్తే ఏడాదికి ఒకసారి మాత్రమే మహాశివరాత్రి వస్తుంది. ఈ మహాశివరాత్రి పండుగ రోజున రాత్రి మొత్తం జాగరణ చేసి, ఉపవాసం ఉంది ప్రత్యేకంగా శివ ఎన్నో పూజిస్తూ ఉంటారు. ఇకపోతే ఈ ఏడాది శివరాత్రి ఫిబ్రవరి 26న వస్తుంది. ఆ రోజు శివాలయాలకు వెళ్లి పూజలు చేయడం ఆనవాయితీ. కానీ ఈ పండుగ ఎందుకు చేసుకుంటామో చాలామందికి తెలియదు. అ కారణాలు ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం..

ప్రతి ఏడాది ఫాల్గుణ మాసం కృష్ణపక్ష చతుర్దశి నాడు మహాశివరాత్రి వస్తుంది. శివుడిని ప్రసన్నం చేసుకోవడానికి ప్రజలు ఉపవాసం ఉంటారు. ఆ రోజు ప్రధాన శివాలయాల్లో భక్తుల రద్దీ కూడా చాలా ఉంటుంది. మహా శివరాత్రి ఎందుకు జరుపుకుంటారనే దానిపై చాలా నమ్మకాలు ఉన్నాయి. అయితే ఒకసారి బ్రహ్మ, విష్ణువుల మధ్య ఎవరు గొప్పా? అనే వాదన వచ్చింది. ఈ వాదన జరుగుతుండగా, అక్కడ అగ్ని రూపంలో ఒక పెద్ద శివలింగం ప్రత్యక్షమైంది. ఈ శివలింగం చివరను కనుగొన్నవారే గొప్పవారు అని అశరీరవాణి వినిపించింది. చివరను కనుగొనడానికి విష్ణువు జ్యోతిర్లింగం అడుగు భాగానికి, బ్రహ్మ పైభాగానికి వెళ్లారు.

చాలా ఏళ్లు ప్రయత్నించినా ఇద్దరూ జ్యోతిర్లింగం చివరను కనుగొనలేకపోయారు. కానీ విష్ణువుతో బ్రహ్మ అబద్ధం చెప్పాడు. నేను ఈ జ్యోతిర్లింగం చివరను కనుగొన్నాను అని, అప్పుడు అక్కడ మహాదేవుడు ప్రత్యక్షమై ఈ జ్యోతిర్లింగం నా రూపం అన్నాడు. బ్రహ్మ అబద్ధం చెప్పడంతో శివుడు అతన్ని పూజించకూడదని శపించాడు. సత్యం చెప్పిన విష్ణువును ప్రశంసించాడు. శివుడు ఫాల్గుణ మాసం కృష్ణపక్ష చతుర్దశి నాడు నన్ను పూజించేవారికి అకాల మరణ భయం ఉండదని చెప్పాడు. అప్పటి నుంచి మహాశివరాత్రి జరుపుకుంటూ వస్తున్నారు. చాలా చోట్ల మహాశివరాత్రిని శివుడు, పార్వతి కల్యాణంగా జరుపుకుంటారు. ఫాల్గుణ మాసం కృష్ణపక్ష చతుర్దశినాడే శివపార్వతుల కల్యాణం జరిగిందని నమ్మకం. ఈ రోజున రాత్రంతా మేలుకొని శివుడిని పూజిస్తే దంపతుల బంధం బలపడుతుందని భక్తుల నమ్మకం.