Site icon HashtagU Telugu

Mahashivratri: శివరాత్రి రోజు ఉపవాసం ఉండేవారు ఏం తినాలి ఏం తినకూడదో తెలుసా?

Mixcollage 04 Mar 2024 08 25 Am 6093

Mixcollage 04 Mar 2024 08 25 Am 6093

ప్రతి సంవత్సరం ఫాల్గుణ మాసంలో కృష్ణ పక్షం నాల్గో రోజున మహా శివరాత్రి పర్వదినాన్ని జరుపుకుంటారు. ఈ ఏడాది మహాశివరాత్రి మార్చి 8వ శుక్రవారం వచ్చింది. అయితే ఈ మహాశివరాత్రి రోజు భక్తులు పరమేశ్వరున్ని భక్తిశ్రద్ధలతో పూజించడంతో పాటు ఉపవాసాలు కూడా ఉంటారు. అయితే ఈ ఉపవాసం సమయంలో తెలిసి తెలియక కొన్ని రకాల తప్పులు చేస్తూ ఉంటారు. అటువంటి వాటిలో తీసుకునే ఆహార పదార్థాలు కూడా ఒకటి. ఉపవాస సమయంలో ఎలాంటి ఆహార పదార్థాలు తీసుకోవాలి? ఎలాంటివి తినకూడదు అన్న విషయంపై చాలామందికిఎన్నో రకాల సందేహాలు ఉన్నాయి.

మరి ఈ విషయంపై పండితులు ఏం చెబుతున్నారో ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఈ ఏడాది మహాశివరాత్రిని మార్చి 8న న వచ్చింది. ఈ రోజున శివ పార్వతులు వివాహం చేసుకున్నారని ప్రతీతి. అందుకే ఈ రోజును మహాశివరాత్రిగా జరుపుకుంటారు. ఈ పవిత్రమైన రోజున శివభక్తులు శివుడు, పార్వతిలను పూజిస్తారు. ఉపవాసం ఉంటారు. మీరు కూడా మహాశివరాత్రి నాడు ఉపవాసం ఉంటే, ఉపవాసానికి ముందు, అప్పుడు ఏవి తినాలో ఖచ్చితంగా తెలుసుకోవాలి. మహాశివరాత్రి నాడు ఉదయాన్నే స్నానమాచరించి శుభ్రమైన బట్టలు వేసుకుని శివపార్వతులను పూజించాలి.

ఆ తర్వాత ఉపవాసం ఉండాలి. మహాశివరాత్రి ఉపవాసం సమయంలో నారింజ, అరటి, ఆపిల్ వంటి పండ్లను తినొచ్చు. వీటితో పాటుగా మహాశివరాత్రి నాడు సాయంత్రం సింఘారా హల్వా, సాబుదానా కిచిడీని తినవచ్చు. అలాగే కొబ్బరినీళ్లు, రైస్ ఖీర్ ను కూడా తీసుకోవచ్చు. మహాశివరాత్రి ఉపవాసం సమయంలో వెల్లుల్లి, ఉల్లిపాయలను తినడం నిషిద్ధం. ఈ రోజున రాతి ఉప్పును ఉపయోగించాలి. అలాగే మాంసం, ఆల్కహాల్ కు కూడా దూరంగా ఉండాలి. అంతేకాకుండా ఉపవాస సమయంలో చిరుధాన్యాలు, బియ్యం, గోధుమలు, బార్లీ తినడం కూడా నిషిద్ధమే.