Site icon HashtagU Telugu

Mahashivratri: మహాశివరాత్రి రోజు ఈ వస్తువులను సమర్పిస్తే చాలు.. అదృష్టం మారాల్సిందే?

Mixcollage 06 Mar 2024 07 41 Pm 1643

Mixcollage 06 Mar 2024 07 41 Pm 1643

రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలు పరమేశ్వరుని భక్తులు ఎప్పుడెప్పుడు అని ఎదురుచూస్తున్న మహాశివరాత్రి పర్వదినం మరొక రెండు రోజుల్లో రానుంది. ఇప్పటికే ఆలయాల్లో అందుకు సంబంధించిన ఏర్పాట్లను ముమ్మరంగా చేస్తున్నారు. ఇక మహాశివరాత్రి పర్వదినం రోజున భక్తులు పరమేశ్వరన్ని భక్తిశ్రద్ధలతో పూజలు చేయడంతో పాటు ఉపవాసం కూడా ఉంటారు. దేశవ్యాప్తంగా ఉన్న హిందువులందరూ అత్యంత పవిత్రంగా జరుపుకునే విశేషమైన పర్వదినం మహాశివరాత్రి పర్వదినం. ఈరోజు ఎవరైతే పరమశివుని అత్యంత భక్తిశ్రద్ధలతో పూజించి, ఉపవాస దీక్షను ఆచరించి, జాగరణ చేస్తారో వారికి సత్ఫలితాలు వస్తాయని, పాపాలు పోయి పుణ్యగతులు ప్రాప్తిస్తాయని, సంపద, శ్రేయస్సు కలుగుతుందని, శివయ్య కటాక్షం దొరుకుతుందని చెబుతారు.

శివరాత్రి పర్వదినం నాడు శివునికి ఇష్టమైనటువంటి వస్తువులను సమర్పిస్తే మంచిదట. మరి ఆ వస్తువులు ఏమిటో వాటి ప్రాధాన్యత ఏమిటో ప్రస్తుతం మనం తెలుసుకుందాం.. ఈ సంవత్సరం మార్చి 8వ తేదీన మహాశివరాత్రి పర్వదినం వస్తుంది. ఈరోజు శివయ్యకు పాలు సమర్పిస్తే, శివలింగానికి పాలతో అభిషేకం చేస్తే శాంతియుతమైన సామరస్యపూర్వకమైన జీవితం లభిస్తుందని చెబుతారు. పాలు స్వచ్ఛతకు ప్రతీక కాబట్టి, అటువంటి స్వచ్ఛమైన పాలను శివయ్యకు నివేదించాలని చెబుతారు. పరమేశ్వరుడికి ఎంతో ఇష్టమైన బిల్వపత్రాలతో పూజిస్తే శివుడు సంతృప్తి చెంది భక్తులను కటాక్షిస్తాడు. భక్తవశంకరుడు, భోళా శంకరుడు అయిన శివుడికి గంగమ్మ అంటే అమితమైన ఇష్టం.

అందుకే శివుడికి జలాన్ని నివేదిస్తే, నీటితో శివుడికి అభిషేకం చేస్తే సంతృప్తి చెందుతాడు. శివయ్యను నీటితో అభిషేకిస్తే మనలోని పాపాలు, మలినాలు ప్రక్షాళన అవుతాయి. శివుడికి ఉమ్మెత్త పూలు అంటే చాలా ఇష్టం. శివుడికి ఉమ్మెత్త పూలను సమర్పించడం అంటే మన కోరికలను, మన అహంకారాన్ని ఆ భగవంతుని ముందు పెట్టి కాపాడమని శరణు కోరడమే. శివుడికి సింధూరాన్ని సమర్పించడం చాలా మంచిది. సింధూరం సమర్పించడం వల్ల సంతోషకరమైన వైవాహిక జీవితం ఉంటుంది. ఇది కుటుంబ శ్రేయస్సుకి దోహదం చేస్తుంది. అలాగే శివుడికి వెలగపండు అంటే చాలా ఇష్టం. వెలగపండుని శివుడికి నైవేద్యంగా సమర్పించడం వల్ల శివయ్య సంతృప్తి చెంది మనల్ని కరుణిస్తాడు. వెలగపండు ఆధ్యాత్మిక వృద్ధి, జ్ఞానోదయం ప్రసాదిస్తుంది. శివుడికి తేనె నివేదించడం తేనెను శివుడికి నివేదించడం వల్ల జ్ఞానం పెరుగుతుందని నమ్ముతారు. అలాగే శివుడి ముందు కొబ్బరికాయను పగలగొట్టడం మన అహంకారాన్ని విచ్చిన్నం చేసి, స్వచ్ఛమైన మనసుతో భగవంతుడికి మనల్ని మనం సమర్పించుకోవడమే. ఇలా ఈ పవిత్రమైన వస్తువులతో శివయ్యను ఆరాధించిన వారికి శివుడి అనుగ్రహం తప్పకుండా దొరుకుతుందని నమ్ముతారు. మహా శివరాత్రి నాడు ఈ వస్తువులతో శివుడిని పూజించి గొప్ప ఫలితం పొందాలని చెప్తున్నారు.