Mahamrityunjay Mantra : మహామృత్యుంజయ మంత్రంతో బీపీ, షుగర్ సహా నయం కాని జబ్బులు దూరం…!!!

మహామృత్యుంజయ మంత్రం అంటే శివునికి చాలా ఇష్టం. ఈ మహామృత్యుంజయ మంత్రాన్ని పఠిస్తే పరమశివుని స్తుతించి, సాధన, జపం, తపస్సు, శివుని ప్రసన్నం చేసుకుని తీవ్రమైన రోగాల నుండి విముక్తి పొందుతారు.

  • Written By:
  • Publish Date - June 20, 2022 / 06:00 AM IST

మహామృత్యుంజయ మంత్రం అంటే శివునికి చాలా ఇష్టం. ఈ మహామృత్యుంజయ మంత్రాన్ని పఠిస్తే పరమశివుని స్తుతించి, సాధన, జపం, తపస్సు, శివుని ప్రసన్నం చేసుకుని తీవ్రమైన రోగాల నుండి విముక్తి పొందుతారు. అంతేకాదు అకాల మృత్యుభయం తొలగిపోతుంది. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం, మహామృత్యుంజయ మంత్రాన్ని దుష్ట గ్రహాల యొక్క దుష్ప్రభావాలను తొలగించడానికి, జీవితాన్ని ఆనందంగా గడిపేందుకు జపిస్తారు. ఈ మంత్రాన్ని పఠించడం వల్ల మరణం దగ్గరకు వచ్చిన తర్వాత కూడా విజయం సాధించవచ్చని నమ్ముతారు. ఇందులో ప్రత్యేకించి శివుని స్తుతి స్తోత్రం చేస్తారు. ఈ మంత్రాన్ని పఠించడం వల్ల కలిగే ప్రయోజనాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

మహామృత్యుంజయ మంత్రం

“ఓం త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం.

మహామృత్యుంజయ మంత్రం- ప్రయోజనాలు

ఆయుష్షు పెరగాలంటే:
ప్రతి ఒక్కరూ భూమిపై ఎక్కువ కాలం జీవించాలని కోరుకుంటారు. కుటుంబంతో గడపాలని కోరకుంటారు. అలాంటివారి మహామృత్యుంజయ మంత్రాన్ని క్రమం తప్పకుండా జపించడం ద్వారా, అకాల మరణ భయం తొలగిపోతుంది.

మంచి ఆరోగ్యం కోసం:
ప్రతి వ్యక్తి ఆరోగ్యమనేది జీవితంలో అతిపెద్ద ఆస్తి. ఈ మంత్రాన్ని పఠించడం వల్ల తీవ్రమైన వ్యాధులు దరిచేరవని నమ్ముతారు. అలాగే బీపీ, షుగర్ సహా నయం కానీ జబ్బులన్నీ దూరం అవుతాయి.  క్రమం తప్పకుండా జపించడం వల్ల మనిషి ఆరోగ్యంగా ఉంటాడు.

సంపద, తేజస్సు కోసం :
ఈ మంత్రాన్ని పఠించడం ద్వారా, ఒక వ్యక్తి ఆరోగ్యవంతమైన శరీరాన్ని పొందడమే కాదు… సంపద, కీర్తి, ఆనందం, సౌలభ్యం లభిస్తాయి. అలాగే భౌతిక సుఖాలు కూడా లభిస్తాయి. ఈ మంత్రాన్ని జపించినవారికి శివుడు ప్రసన్నుడైతే, మనిషికి ఎప్పుడూ డబ్బు ధాన్యాల కొరత ఉండదని నమ్ముతారు.

ఒక వ్యక్తి గౌరవం పొందుతాడు;
జ్యోతిష్య శాస్త్రం ప్రకారం, క్రమం తప్పకుండా శివుని పూజించడంతోపాటు మహామృత్యుంజయ జపం చేయడం ద్వారా, వ్యక్తి సమాజంలో స్థానం, ప్రతిష్టను పొందుతాడు.

సంతానం కలగాలంటే:
సంతానం కలగాలంటే నిత్యం మహామృత్యుంజయ మంత్రాన్ని జపించాలి. సంతానం లేక బాధపడుతున్నవారికి….సంతాన ప్రాప్తి లభిస్తుంది.