Site icon HashtagU Telugu

Srisailam: శ్రీశైలంలో ముగిసిన మహాకుంభాభిషేక మహోత్సవం, భక్తుల సందడి

Srisailam

Srisailam

Srisailam: ఈ నెల 19వ తేదీన ప్రారంభమైన మహాకుంభాభిషేకం మహోత్సవం ఈ బుధవారం రోజుతో ముగిసింది. బుధవారం రోజు జరిగి మహాకుంబాభిషేక మహోత్సవంలో కంచికామకోటి పీఠాధిపతులు శ్రీశ్రీశ్రీ విజయేంద్ర సరస్వతీ మహాస్వామివారు, శ్రీశైల జగద్గురు పీఠాధిపతులు శ్రీశ్రీశ్రీ చెన్నసిద్ధరామ పండితారాధ్య శివాచార్య మహాస్వామివారు, పుష్పగిరి పీఠాధిపతులు శ్రీశ్రీశ్రీ విద్యాశంకర భారతీ మహాస్వామివారు, కాశీ పీఠాధిపతి శ్రీశ్రీశ్రీ మల్లికార్జున విశ్వరాధ్య శివాచార్య మహాస్వామివారు పాల్గొన్నారు.

అదేవిధంగా ఈ కార్యక్రమములో గౌరవ ఉపముఖ్యమంత్రివర్యులు మరియు దేవదాయ శాఖామాత్యులు కొట్టు సత్యనారాయణ, నంద్యాల పార్లమెంట్ సభ్యులు పోచాబ్రహ్మానందారెడ్డి. శ్రీశైల నియోజవర్గం శాసనసభ్యులు శిల్పా చక్రపాణిరెడ్డి, తదితరులు పాల్గొన్నారు.రాష్ట్రదేవదాయశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కరికాల్ వళవన్, రాష్ట్ర దేవదాయశాఖ కమీషనర్ ఎస్. సత్యనారాయణ కూడా ఈ మహాకుంభాభిషేకమహోత్సవంలో పాల్గొనడం జరిగింది.

కాగా ప్రధానాలయంలో శివాజీగోపుర పునర్నిర్మాణం, ఆలయప్రాంగణంలోని కొన్ని ఉపాలయాల పునరుద్ధరణ, పంచమఠాలలోని మూడు మఠాల పునరుద్ధరణ మరియు ఆయా ఉపాలయాలో, మఠాలలో శివలింగ, నందీశ్వరుల ప్రతిష్ఠ సందర్భంగా ఈ మహాకుంభాభిషేకం జరిపించబడింది. ప్రధానాలయంలోని శ్రీస్వామివారి గర్భాలయ విమానం, అమ్మవారి గర్భాలయ విమానం, నాలుగుదిక్కులు గల నాలుగు ప్రధానగోపురాలు, అమ్మవారి ద్వారగోపురం మరియు ఆలయ ప్రాంగణంలోని అన్ని ఉపాలయాలు, పరివారఆలయాలలో ఈ కుంభాభిషేకం జరిపించబడింది.