ప్రపంచంలోనే అతిపెద్ద ఆధ్యాత్మిక కార్యక్రమమైన మహాకుంభమేళా జనవరి 13, 2025న ఉత్తరప్రదేశ్ రాష్ట్రం లోని ప్రయాగరాజ్ లో ప్రారంభమైన విషయం తెలిసిందే. ఇది ఫిబ్రవరి 26 మహాశివరాత్రి వరకు కొనసాగనుంది. ఈ కుంభమేళా దాదాపుగా 144 ఏళ్లకు ఒకసారి వస్తుంది. అందుకే మహాకుంభ మేళాకి పెద్ద సంఖ్యలో భక్తులు వస్తుంటారు. కుంభమేళా సమయంలో పవిత్ర రోజుల్లో గంగా, యమునా, సరస్వతి నదుల సంగమ ప్రదేశంలో స్నానం చేయడం వల్ల అన్ని పాపాలు తొలగిపోతాయని భక్తుల నమ్మకం. 144 ఏళ్ల తర్వాత ఈ ఏడాది జరిగే మహాకుంభం అత్యంత పుణ్య ప్రదమని పండితులు చెబుతున్నారు.
ఈ జాతరలో భక్తులు పవిత్రమైన మహా సంగంలో స్నానం చేస్తారు. ఈ స్నానం చేయడం వల్ల మనిషి చేసిన పాపాలన్నీ తొలగిపోతాయని నమ్ముతారు. కానీ చాలా మంది స్నానం చేసేటప్పుడు ఏదో ఒక తప్పు చేస్తారు. అది వారికి పుణ్యం కాకుండా పాపం తెస్తుందట. మరి మహా కుంభ మేళా కాబట్టి మీరు కూడా మహాకుంభానికి వెళ్లి ఉంటే లేదా వెళ్లడానికి సిద్ధమవుతున్నట్లయితే ఇది తెలుసుకోవడం మంచిది. కొంత మంది మురికి అపరిశుభ్రమైన బట్టలు ధరించి స్నానం చేస్తారు. అయితే ఇలా చేయడం అస్సలు మంచిది కాదట. ఇలా చేస్తే పాపం మూట కట్టుకున్నట్లే అని చెబుతున్నారు. మీరు పవిత్ర నదిలో స్నానం చేసినప్పుడు మీ శరీరం మీదన ఉండే నీటిని మురికి గుడ్డతో తుడవకూడద. శరీరంలో నీరు దానంతటదే ఆరిపోయేలా చూడాలి. ఇది భక్తి రూపంగా పరిగణించబడుతుందట.
మహా కుంభమేళాలో స్నానం చేస్తున్నప్పుడు మనస్సులో ప్రతికూల ఆలోచనలు, అసభ్యకరమైన పదాలకు దూరంగా ఉండటం మంచిదని చెబుతున్నారు. అలాగే స్నానం చేసేటప్పుడు సమస్త గురు మంత్రాన్ని జపిస్తూ గురు ధ్యానం చేయాలట. కుంభమేళాలో ఎవరైనా పేదవాళ్లు కనిపిస్తే వారికి ఏదైనా దానం చేయడం మంచిదని చెబుతున్నారు. నిస్సహాయ వ్యక్తికి లేదా పేదవాడు, పిల్లవాడు లేదా వృద్ధురాలు ఇలాంటి వారికీ దానం చేయడం మంచిదని చెబుతున్నారు. స్నానం చేసిన తర్వాత గంగానదిలో మురికి బట్టలు శుభ్రం చేయడం ప్రారంభించే వారు కూడా చాలా మంది ఉంటారు. అలా చేయకూడదట. అలాగే సబ్బు, డిటర్జెంట్ వంటివి కూడా అస్సలు వాడకూడదని చెబుతున్నారు. దీని ద్వారా మనం పవిత్ర నదులను కలుషితం చేసే పాపానికి పాల్పడినట్లు అవుతుందని చెబుతున్నారు. అలాగే అక్కడ ఎలాంటి చెడ్డ పనులు చేయకూడదట.