Site icon HashtagU Telugu

Maha Shivaratri: మహా శివరాత్రి రోజు ఉపవాస సమయంలో ఏమి తినాలి, ఏమి తినకూడదో మీకు తెలుసా?

Mixcollage 27 Feb 2024 12 22 Pm 327

Mixcollage 27 Feb 2024 12 22 Pm 327

హిందూ సనాతన ధర్మంలో అత్యంత ముఖ్యమైన పండుగలలో మహాశివరాత్రి కూడా ఒకటి. ఈరోజు శివుడిని అత్యంత భక్తి శ్రద్దలతో ఆరాధిస్తారు. ఆలయాలను సందర్శిస్తారు. శివరాత్రి రోజున జాగారానికి, ఉపవాసానికి విశిష్టమైన స్థానం ఉంది. మహా శివరాత్రి పండుగ రోజున చాలా మంది నిర్జల వ్రతాన్ని ఆచరిస్తారు. అంటే కొందరు భక్తులు నీరు మాత్రమే తాగుతారు. మరికొందరు పండ్లు, పాలు, తృణధాన్యాలు తిని ఉపవాసం ఉంటారు. అయితే శివ రాత్రి రోజు ఉదయం ప్రారంభమై మరుసటి రోజు ఉదయం ముగుస్తుంది. ఉపవాస నియమాలు అన్ని శివరాత్రిలకు ఒకే విధంగా ఉంటాయి.

సాధారణంగా ప్రజలు ఉపవాస సమయంలో పండ్లు తింటారు. నీరు లేదా పాలు తాగుతారు. కొందరు ఆహారం లేదా పానీయాలకు దూరంగా ఉంటారు. నీళ్లు కూడా తాగకుండా పస్తులు ఉంటారు. మహా శివరాత్రి వ్రతాన్ని అత్యంత శ్రద్ధతో పాటిస్తారు. శివరాత్రి రోజున చేసే ఉపవాసం, రాత్రి జాగరణను అత్యంత భక్తి శ్రద్దలతో చేస్తే శివుడు భక్తులకు ఆనందం, శ్రేయస్సును ప్రసాదిస్తాడని నమ్మకం. పాలు, ఆకులు, పండ్లు సమర్పించడానికి సమీపంలోని శివాలయాన్ని సందర్శించి శివరాత్రిని ప్రారంభం అవుతుంది. మరికొందరు స్వీట్లు, పెరుగు, తేనెను కూడా సమర్పిస్తారు. ప్రజలు పగలు, రాత్రి ఉపవాసం ఉంటారు.

రాత్రి సమయంలో భక్తులు శివుని స్తోత్రాలు ఆలపించి పూజలు నిర్వహిస్తారు. శివలింగానికి అభిషేకం చేస్తారు. మర్నాడు ప్రజలు పూజ చేసిన తర్వాత భోజనం చేసి ఉపవాసం విడిచి పెడతారు. అలాగే మహాశివరాత్రి రోజు ఉపవాసం ఉండేవారు పప్పులు, ఉప్పు, గోధుమ , బియ్యం వంటి తృణధాన్యాలకు దూరంగా ఉండాలి.
ఉడికించిన చిలగడ దుంపలు, పండ్లు వంటి ఆహారా పదార్ధాలను తినవచ్చు. చిలగడ దుంపలను పసుపు, వెల్లుల్లి లేదా ఉల్లిపాయలను వేసి ఉడికించకూడదు. ఒకవేళ శివ రాత్రి సమయంలో తినే ఆహారంలో ఉప్పు ఉపయోగించాల్సి వస్తే రాతి ఉప్పుని ఉపయోగించాలి.

ఈ రోజున ఉపవాసం రోజున పండ్లు, పాలు, నీరు తీసుకోవచ్చు. మహా శివరాత్రి నాడు భక్తులు ప్రత్యేక ఆహారాన్ని ఫలహారంగా తీసుకోవచ్చు. సగ్గుబియ్యం కిచిడి లేదా సగ్గుబియ్యం జావా వంటి ఫుడ్ ఐటమ్స్ అల్పాహారంగా చేసుకోవచ్చు. మిరియాలు, యాలకులు, బాదం, గసగసాలు, సోపు గింజలు కలిపి తయారు చేసిన తండై పొడిని జోడించడం ద్వారా మీరు రుచికరమైన తాండాయి పానీయాన్ని తయారు చేసుకోండి. ఈ పానీయం మిమ్మల్ని హైడ్రేట్ గా ఉంచడమే కాకుండా శరీరానికి శీతలకరణిగా కూడా పనిచేస్తుంది. మీరు ఉడికించిన చిలగడదుంప, మసాలాలు లేకుండా ఆలూ టిక్కీ, పనీర్ కూడా తీసుకోవచ్చు.