Maha shivratri 2024: మహాశివరాత్రి రోజు పూజలు చేస్తున్నారా.. అయితే పనులు అస్సలు చేయకండి?

  • Written By:
  • Updated On - March 8, 2024 / 01:26 PM IST

దేశవ్యాప్తంగా ఉన్న హిందువులు జరుపుకునే అతి ముఖ్యమైన పండుగలో మహాశివరాత్రి కూడా ఒకటి. భోళా శంకరుడికి ఇష్టమైన ఈ రోజున ఆ శివుడికి ఇష్టమైన వాటిని సమర్పించడంతో పాటు ప్రత్యేకంగా భక్తిశ్రద్ధలతో పూజలు కూడా చేస్తూ ఉంటారు. ఆ పరమశివునికి అత్యంత ఇష్టమైన శివరాత్రి పర్వదినాన ఎవరైతే ఆ శివుని ప్రసన్నం చేసుకోవడానికి ఆయనకు ఇష్టమైన విధంగా పూజాధికాలం నిర్వహిస్తారో వారిపై పరమశివుని కటాక్షం ఉంటుందట. ఈ సంవత్సరం మహా శివరాత్రి పర్వదినం మర్చి 8 వ తేదీన వస్తుంది. శివ భక్తులు అందరూ మహాశివరాత్రి జాగారానికి రెడీ అవుతున్నారు. శివరాత్రి నాడు శివుడిని పూజించేటప్పుడు ఈ తప్పులు చెయ్యొద్దు అయితే శివరాత్రి పర్వదినం రోజు ఎంత విశేషంగా పూజలు చేసిన వారైనా పండుగ రోజు కొన్ని తప్పులు చేస్తే శివుడికి పూజలు చేసిన ఫలితం ఉండదని చెబుతారు.

మహాశివరాత్రి పర్వదినాన శివుడిని ప్రసన్నం చేసుకోవడానికి ఏ విధంగా ఉండాలి? ఏం చేయకూడదు అనే విషయాలను ప్రస్తుతం మనం ఇక్కడ తెలుసుకుందాం.. మహాశివరాత్రి పర్వదినాన శివుడిని పూజించే సమయంలో, శివుడికి అర్చన చేసే సమయంలో పొరపాటున కూడా తులసీ దళాలను ఉపయోగించకూడదు. అభిషేకం చేసే విషయంలో జాగ్రత్త శివుడిని బిల్వపత్రాలతో పూజించాలని, తులసి దళాలతో శివుని పూజించడం చేయకూడదు. శివరాత్రి రోజు చాలామంది శివుడికి అభిషేకం చేస్తూ ఉంటారు. శివాలయాలలో శివలింగానికి అభిషేకాలు, అర్చనలు చేసేవారు పాల ప్యాకెట్లను ఉపయోగించకూడదు. ఆవుపాలతో శివుడికి అభిషేకాన్ని చేస్తే మంచి ఫలితం ఉంటుందట.

అంతేకాదు శివుడికి స్వచ్ఛమైన నీటితోనూ అభిషేకం చేస్తే మంచిదట. మహాశివరాత్రి నాడు ఈ తప్పులు చెయ్యొద్దు ఇక శివుడికి అభిషేకం చేసే సమయంలో పొరపాటున కూడా మన శరీరంపై ఉన్న చెమట కానీ, వెంట్రుకలు కానీ శివుడిపై పడకూడదు. మహాశివరాత్రి పర్వదినాన పచ్చి మంచినీళ్లు కూడా తాగకుండా ఉపవాసం చేయాలన్న నియమం ఏమీ లేదని కడుపు ఆకలితో ఉంటే శివుడు మీద మనసు లగ్నం చేయడం కష్టంగా ఉంటుందట. శివరాత్రి పర్వదినాన ఎటువంటి పరిస్థితులలోనూ ఆల్కహాల్ సేవించడం కానీ, స్మోకింగ్ చేయడం కానీ చేయకూడదు. అది మనం చేసిన పూజల ఫలితాన్ని ఇవ్వదు. శివరాత్రి నాడు భార్యాభర్తల కలయిక కూడా పూజల ఫలితాన్ని అందించదు. శివరాత్రి నాడు పూజల ఫలితం కలగాలంటే ఇది చెయ్యండి శివరాత్రి పర్వదినం నాడు నిష్ఠతో శివుడిని పూజించడంతోపాటు దానధర్మాలు చేయడం వల్ల మంచి ఫలితాలు కలుగుతాయి.