Maha Shivaratri: మహాశివరాత్రి రోజు చేయకూడనివి, చేయాల్సిన పనులు ఇవే?

హిందూమతంలో మహా శివరాత్రి పండుగ అత్యంత విశిష్టమైనది. ప్రతినెలా వచ్చే శివరాత్రిని మాస శివరాత్రి అంటారు.

  • Written By:
  • Publish Date - February 18, 2023 / 06:00 AM IST

హిందూమతంలో మహా శివరాత్రి పండుగ అత్యంత విశిష్టమైనది. ప్రతినెలా వచ్చే శివరాత్రిని మాస శివరాత్రి అంటారు. కానీ మాఘమాసంలో వచ్చే శివరాత్రి మహాశివరాత్రి అని పిలుస్తారు. మహాశివరాత్రి రోజున హిందువులు పరమేశ్వరుడిని భక్తిశ్రద్ధలతో పూజిస్తూ ఉంటారు. మహాశివరాత్రి రోజున శివపార్వతుల కళ్యాణం జరిగింది. మహాశివరాత్రి రోజున భక్తులు శివుని ఆలయాలకు వెళ్లి బల్వపత్రాలు, గంగాజలం,పాలు, పెరుగు ఉమ్మెత్త పువ్వులు వంటి వాటిని ఉపయోగించి అభిషేకాలు చేస్తూ ఉంటారు. మహాశివరాత్రి రోజున శివుని ఆలయానికి వెళ్లి పరమేశ్వరున్ని భక్తిశ్రద్ధలతో పూజించడం వల్ల తప్పకుండా ఆ పరమేశ్వరుని అనుగ్రహం లభిస్తుంది.

ఇక ఈ ఏడాది మహాశివరాత్రి పండుగ ఫిబ్రవరి 18 అనగా నేడు శనివారం జరుపుకోనున్నారు. అయితే మహాశివరాత్రి రోజున కొంతమంది తెలిసి తెలియక కొన్ని రకాల తప్పులను చేస్తూ ఉంటారు. ఆ తప్పుల వల్ల ఆ పరమేశ్వరుని అనుగ్రహం కాకుండా పరమేశ్వరునికి కోపం తెప్పించిన వాళ్ళం అవుతాం. ఇదే మహాశివరాత్రి రోజున కొన్ని రకాల పనులు చేయాలి మరికొన్ని పనులు చేయకూడదు. మరి ఎటువంటి పనులు చేయాలి ఎటువంటి పనులు చేయకూడదో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. మహా శివరాత్రి నాడు ఏమి చేయాలి అన్న విషయానికి వస్తే.. మహా శివరాత్రి నాడు ఉదయాన్నే తల స్నానం చేసి, ఉపవాస దీక్ష చేపట్టి పూజించాలి.

సూర్య భగవానుడికి అర్ఘ్యం సమర్పించిన తరువాత ఇంటికి సమీపంలో ఉన్న శివాలయానికి వెళ్లి శివలింగానికి జలాభిషేకం చేయండి. శివయ్యకు జలాభిషేక సమయంలో శివలింగంపై బిల్వ, జమ్మి, పాలు, గంగాజలం, పువ్వులు, తేనె, ఉమ్మెత్తను సమర్పించాలి. అంతేకాకుండా మహాశివరాత్రి రోజున మహామృత్యుంజయ మంత్రంతో పాటు అన్ని శివ మంత్రాలను పఠించడం శుభప్రదంగా పరిగణించబడుతుంది. అలాగేమహాశివరాత్రి రోజున ఉపవాసం ఉండి, రాత్రంతా నిద్రపోకుండా జాగారం చేయడం వల్ల పరమేశ్వరుని అనుగ్రహం తప్పకుండా లభిస్తుంది. ఇక మహా శివరాత్రి నాడు ఏమి చేయకూడదు అన్న విషయానికి వస్తే.. మహా శివరాత్రి రోజున మాంసం, మద్యం, ఉల్లి,వెల్లుల్లి వంటివి తీసుకోకూడదు. అంతేకాదు శివాలయంలో కొన్ని వస్తువులను సమర్పించడం నిషేధం. తులసి ఆకులు, పసుపు, కుంకుమ, కొబ్బరి నీళ్లు సమర్పించకూడదు. శివలింగ పూజలో శంఖాన్ని ఉపయోగించకూడదు.