హిందూమతంలో మహా శివరాత్రి పండుగ చాలా విశిష్టమైనది. ఈ రోజున పరమేశ్వరుని అత్యంత భక్తిశ్రద్ధలతో పూజిస్తూ ఆరాధిస్తూ ఉంటారు. శివరాత్రి రోజు ఉపవాసం ఉండడంతో పాటు రాత్రి మొత్తం మేల్కొని జాగరణ కూడా చేస్తూ ఉంటారు. అయితే ఈ శివరాత్రి రోజు చాలామంది తెలిసి తెలియక చిన్న పొరపాట్లు చేస్తూ ఉంటారు. వీటివల్ల అనేక ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని చెబుతున్నారు. శివరాత్రి పండుగ రోజు చేయవలసినవి చేయకూడని పనుల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం..
మహా శివరాత్రి నాడు ఏమి చేయాలంటే.. మహా శివరాత్రి నాడు ఉదయాన్నే స్నానం ఆచరించి, ఉపవాస దీక్ష చేపట్టి పూజించాలి. సూర్య భగవానుడికి ఆర్ఘ్యం సమర్పించిన తరువాత ఇంటికి సమీపంలో ఉన్న శివాలయానికి వెళ్లి శివలింగానికి జలాభిషేకం చేయాలట. శివయ్యకు జలాభిషేక సమయంలో శివలింగంపై బిల్వ, జమ్మి, పాలు, గంగాజలం, పువ్వులు, తేనె, ఉమ్మెత్తను సమర్పించాలని చెబుతున్నారు. అంతేకాదు మహాశివరాత్రి రోజున మహామృత్యుంజయ మంత్రంతో పాటు అన్ని శివ మంత్రాలను పఠించడం శుభప్రదంగా పరిగణించబడుతుందట.
ఇకపోతే మహా శివరాత్రి నాడు ఏమి చేయకూడదు అన్న విషయానికి వస్తే.. మహా శివరాత్రి రోజున మాంసం, మద్యం, ఉల్లి, వెల్లుల్లి వంటివి తీసుకోకూడదట. అంతేకాదు శివాలయంలో కొన్ని వస్తువులను సమర్పించడం నిషేధం అని చెబుతున్నారు. తులసి ఆకులు, పసుపు, కుంకుమ, కొబ్బరి నీళ్లు సమర్పించకూడదు. అంతేకాదు కాదు శివలింగ పూజలో శంఖాన్ని ఉపయోగించకూడదని చెబుతున్నారు..