Site icon HashtagU Telugu

Srisailam: శ్రీశైలంలో మహా కుంభాభిషేకం, వేదమంత్రాల మధ్య ప్రారంభ పూజలు

Srisailam1

Srisailam1

Srisailam: శ్రీశైలంలో ఘనంగా ప్రారంభమైన మహాకుమాభిషేకం నేటి నుంచి ఈనెల 21 వరకు ఆరు రోజులపాటు ఆలయంలో మహాకుంభాభిషేక నిర్వహించనున్న దేవస్థానం అధికారులు మొదటి రోజులో భాగంగా నేడు ఉదయం రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ దంపతులు ప్రధాన ఆలయంలోని గర్భాలయం చుట్టూ ప్రదక్షణ చేసి అనంతరం వేదమంత్రాలు మధ్య స్వామివారి యాగశాల ప్రవేశం చేసి మహాగణపతి పూజతో మహా కుంభాభిషేకానికి మంత్రి దంపతులు శ్రీకారం చుట్టారు.

అనంతరం రుత్వికులు లోక కళ్యాణం కాంక్షిస్తూ సంకల్పాన్ని పాటించారు నేడు ప్రారంభమైన కుంభాభిషేకం 21వ రోజు ప్రధాన ఘట్టం కాగా అదే రోజు ఎప్పటి నుండి పునర్నిర్మించి శివాజీ గోపురానికి కలిశా ప్రతిష్ట నిర్వహించి మహాకుంభాభిషేక కృతువులను జరిపించనున్నారు వీటితోపాటు ఉభయ ఆలయాల్లో ఉన్న ఉపాలయాలను అలానే పరివార ఆలయాలలో భాగమైన పంచ మఠాలలో మూడు మటాలకు లింగాలను నందీశ్వరులను ప్రతిష్ట చేసి మహా కుంభాభిషేకం నిర్వహించనున్నారు మొదటి రోజు ప్రారంభ పూజలకు శ్రీశైలం జగద్గురు 1008 చిన్న సిద్ధ రామ శివాచార్య మహాస్వామిజి కూడా హాజరయ్యారు నేటి నుండి 21 వరకు ప్రతిరోజు శ్రీస్వామి అమ్మవార్లకు ప్రత్యేక పూజాదికాలు నిర్వహించనున్నారు