Site icon HashtagU Telugu

Maha Kumbha 2025: మహాకుంభ మేళాలో స్నానం చేసిన తర్వాత ఈ వస్తువులు దానం చేస్తే చాలు.. అంతా శుభమే!

Maha Kumbha 2025

Maha Kumbha 2025

ప్రస్తుతం మహా కుంభ మేళా జరుగుతున్న విషయం తెలిసిందే. కాగా ఈ మహాకుంభ మేళా సందర్భంగా దేశ, విదేశాల నుంచి కోట్లాది మంది భక్తులు తరలి వస్తున్నారు. ప్రయాగ్‌రాజ్‌ లో మహాకుంభ మేళా 2025 ప్రారంభమైన విషయం తెలిసిందే. మకర సంక్రాంతి సందర్భంగా కోట్లాది మంది భక్తులు త్రివేణి సంగమంలో స్నానాలు చేస్తున్నారు. మహా కుంభంలో స్నానం చేయడం వల్ల తెలిసి తెలియక చేసిన పాపాలు నశిస్తాయని, అలాగే దేవుడి అనుగ్రహం లభిస్తుందని నమ్మకం. అయితే మహాకుంభ స్నానంలో చేసిన తర్వాత కొన్ని వస్తువులను దానం చేయాలట. ఇలా చేయడం వల్ల శుభ ఫలితాలను పొందడంతో పాటు పూర్వికుల ఆశీస్సులు కూడా లభిస్తాయి అని చెబుతున్నారు.

మరి కుంభమేళాలో స్నానం చేసిన తర్వాత ఎలాంటి వస్తువులు దానం చేయాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. అన్ని దానాల కన్నా అన్నదానం గొప్పది అని అంటూ ఉంటారు. కాబట్టి కుంభమేళా స్నానం చేసిన తర్వాత తప్పనిసరిగా అన్నం దానం చేయాలని చెబుతున్నారు. ఆహారాన్ని దానం చేయడం వలన ఆధ్యాత్మిక సంతృప్తిని పొందవచ్చట. పూర్వీకుల ఆత్మకి కూడా విముక్తి లభిస్తుందని చెబుతున్నారు. పూర్వీకుల ఆశీస్సులతో జీవితంలో మంచి మార్పులు చోటుచేసుకుంటాయట. మహా కుంభమేళాలో స్నానం చేసిన తర్వాత అవసరమైన వారికి వస్త్ర దానం చేయడం వల్ల ఆధ్యాత్మిక పరంగా ప్రయోజనం చేకూరుతుందట. పేద ప్రజలకు ఉపశమనం లభిస్తుంది. అటువంటి పరిస్థితిలో మహా కుంభస్నానం తర్వాత ఆర్ధిక శక్తి మేరకు బట్టలు దానం చేయాలని చెబుతున్నారు.

అలాగే మహా కుంభమేళాలో స్నానం చేసిన తర్వాత అక్కడ ఘాట్ లో ఉన్న నీటిని సేకరించి ఇంటికి తీసుకువస్తూ ఉంటారు. ఈ గంగాజలాన్ని ఇంట్లో ఉంచుకోవడం శ్రేయస్కరం. అంతేకాదు ఈ నీటిని దానం చేయడం వల్ల కూడా శుభం జరుగుతుందట.ఈ పవిత్ర జలాన్ని ఆలయానికి ఇవ్వవచ్చు లేదా అవసరమైన వారికి ఇవ్వవచ్చట. గంగాజలాన్ని దానం చేయడం వల్ల ఆత్మకు శాంతి లభిస్తుందని పండితులు చెబుతున్నారు. కుంభమేళ స్నానం తర్వాత ఎవరి సామర్థ్యం మేరకు వారు డబ్బును దానం చేయాలని చెబుతున్నారు. అనాథాశ్రమానికి లేదా వృద్ధాశ్రమానికి విరాళంగా ఇవ్వడం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుందట. అలాగే మహా కుంభమేళా స్నానం తర్వాత నువ్వులు,బెల్లం దానం చేయడం వల్ల శారీరక మానసిక శుద్ధి లభిస్తుందట. మహాకుంభ స్నానం తర్వాత గోవును దానం చేయడం లేదా గోశాలలకు ధాన్యాన్ని దానం చేయడం చాలా శుభప్రదం అని చెబుతున్నారు. ఈ రెండు వస్తువులను దానం చేయడం వలన అనేక సమస్యలను పరిష్కరించవచ్చట. ఆనందం, శాంతిని కూడా పొందవచ్చని పండితులు చెబుతున్నారు.