Coconut: కష్టాలు సమస్యలతో సతమతమవుతున్నారా.. అయితే కొబ్బరికాయతో ఈ పరిహారం ట్రై చేయాల్సిందే?

హిందువులు ఎటువంటి శుభకార్యం మొదలుపెట్టిన కూడా ముందుగా కొబ్బరికాయను కొట్టి ఆ తర్వాత ఆ పనులను ప్రారంభిస్తూ ఉంటారు. పూజలు, గృహ ప్రవేశాలు, పెళ్లి

  • Written By:
  • Publish Date - December 14, 2023 / 07:00 PM IST

హిందువులు ఎటువంటి శుభకార్యం మొదలుపెట్టిన కూడా ముందుగా కొబ్బరికాయను కొట్టి ఆ తర్వాత ఆ పనులను ప్రారంభిస్తూ ఉంటారు. పూజలు, గృహ ప్రవేశాలు, పెళ్లి పనులు, బిజినెస్ లు, కట్టడాలు ఎటువంటి మంచి పని మొదలుపెట్టిన కూడా కొబ్బరికాయను కొట్టి ఆ పనిని ప్రారంభిస్తూ ఉంటారు. కొబ్బరికాయకు శాస్త్రంలో కూడా ప్రత్యేకమైన స్థానం. అంతేకాకుండా దేవుడికి కొట్టిన కొబ్బరికాయను ప్రసాదంగా కూడా భావించి తింటూ ఉంటారు. కేవలం వీటికి మాత్రమే కాకుండా కొబ్బరికాయ మనల్ని సమస్యల నుంచి గట్టెక్కించడానికి కూడా ఎంతో బాగా ఉపయోగపడుతుంది. అంతేకాకుండా వాస్తు శాస్త్రంలో చెప్పిన విధంగా ఈ కొబ్బరికాయను ఉపయోగించి కొన్ని రకాల పరిహారాలు చేయడం వల్ల కొన్ని సమస్యల నుంచి బయటపడవచ్చు.

ఆ పరిహారాలు ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం..వైశాఖ మాసంలో ఇంటి ఆవరణలో దక్షిణం లేదా పడమర దిక్కున కొబ్బరి చెట్టు నాటాలి. దీని వల్ల ఆర్థిక స్థితి మెరుగుపడుతుంది. రుణ బాధ నుంచి విముక్తి కూడా దొరుకుతుంది. చిన్న పిల్లలకు చాలా త్వరగా దిష్టి తగులుతుంటుంది. దిష్టి తగిలిన పిల్లలకు మంగళ వారం రోజున తలనుంచి కాలి రకు 11 సార్లు కొబ్బరికాయను తిప్పెయ్యాలి. తర్వాత కొబ్బరి కాయను నిర్జన ప్రదేశంలో పడేయ్యాలి. లేదా ప్రవహించే నీటిలో వదలాలి. అలాగే వ్యాపార అభివృద్ధి కోసం గురువారం రోజు కొబ్బరికాయను గుడ్డలో కట్టి దాన్ని ఇసుకలో ఉంచాలి. తర్వాత విష్ణువు ఆలయంలో ఆ కొబ్బరికాయను సమర్పించాలి. కొబ్బరికాయ సమర్పించిన తర్వాత శ్రీహరికి మీ సమస్యను విన్నవించుకోవాలి.

ఈ పరిహారం చెయ్యడం వల్ల వ్యాపారంలో అడ్డంకులు తొలగిపోయి సజావుగా సాగుతుంది. శుక్రవారం రోజున లక్ష్మీ పూజ చేసుకుని కాయను కొట్టకుండా లక్ష్మీ దేవికి పూర్తి కొబ్బరి కాయను అమ్మవారికి సమర్పించుకోవాలి. తర్వాత దీనిని ఎర్రని వస్త్రంలో చుట్టి ఎవరికీ కనిపించకుండా ఇంట్లో దాచుకోవాలి. ఇలా చెయ్యడం వల్ల ఇంటి ఆర్థిక స్థితి మెరుగవుతుంది. ఇంట్లో గొడవలు సద్దుమణిగి సుఖ సంతోషాలు వెల్లివిరుస్తాయి. ఎంత ధనం ఇంట్లోకి వస్తున్నా నీళ్లలా ఖర్చయి పోతోంటే, పొదుపు చెయ్యడం సాధ్యపడడం లేదని అనిపిస్తే లేదా శని ప్రభావం వల్ల కష్టాలు పడుతున్నట్టయితే శనివారం రోజున 7 కొబ్బరికాయలను నీటితో పాటు అలాగే సమర్పించి ఈ కాయలను పారే నీటిలో లేదా నదిలో వదిలెయ్యాలి. ఇలా చేస్తే శని ప్రభావం తగ్గి డబ్బు కూడా ఆదా అవుతుంది. ఆర్థిక స్థితి కూడా మెరుగవుతుంది. శనివారం రోజున కొబ్బరి కాయను రెండుగా పగులగొట్టాలి. ఆ రెండు కొబ్బరికాయ ముక్కల్లో నిండా చక్కెర నింపాలి. తర్వాత వాటిని నిర్జన ప్రదేశంలో నేలలో పాతి పెట్టాలి. ఇలా చెయ్యడం వల్ల రాహు కేతు, శని దోషాల నుంచి విముక్తి లభిస్తుంది. టెంకాయ తో ఈ విధమైన పరిహారాలు పాటించడం వల్ల ఆర్థిక సమస్యల నుంచి విముక్తి పొందవచ్చు.