మాఘ మాసంలో చేసేటటువంటి పూజలకు మాఘ స్నానాలకు ప్రత్యేకత ఉంటుంది అన్న విషయం తెలిసిందే. మాఘమాసం వచ్చింది అంటే సాలు చాలామంది మాఘ స్నానాలు ఆచరిస్తూ ఉంటారు. అలాగే ఈ మాసం అంతా కూడా నాన్ వెజ్ తినకుండా ఓన్లీ వెజ్ మాత్రమే తింటూ శివుడిని ప్రత్యేకంగా పూజిస్తూ ఉంటారు. కాగా ఈ మాసంలో చేసేటటువంటి పూజలు ప్రత్యేక ఫలితాలను అందిస్తాయని చెబుతున్నారు. మరి మాఘమాసంలో మాఘ స్నానాలు చేస్తే ఎలాంటి ఫలితాలు కలుగుతాయో ఇప్పుడు మనం తెలుసుకుందాం..
దుఃఖ దారిద్ర్యనాశాయ శ్రీ విష్ణోస్తోషణాయచ ప్రాతః స్నానం కరోమ్యద్య మాఘే పాపవినాశనం అనే ఈ శ్లోకాన్ని పఠిస్తూ నదిలో, లేదా బావుల వద్ద స్నానం చెయ్యడం వలన విశేష ఫలితం లభిస్తుందట. నదుల్లో స్నానం చేయడానికి వీలుకాని వారు కనీసం ఇంట్లో స్నానం చేసి సమయంలోనైనా గంగ, గోదావరి, కావేరి వంటి పుణ్య నదులను తలుచుకుంటూ స్నానం ఆచరించాలని, ఇలా చేస్తే విశేష పలితాలు కలుగుతాయని చెబుతున్నారు.
మాఘ స్నానం చేసిన తర్వాత పరమేశ్వరుడిని భక్తిశ్రద్ధలతో పూజించాలట. అలాగే తులసి మొక్క వద్ద ఆవు నేతితో దీపారాధన చేయాలని ఇలా చేస్తే మంచి ఫలితాలు కలుగుతాయని చెబుతున్నారు. ఈ మాసంలో వీలైనంత వరకు పారే నదిలో నీటిలో స్నానం చేస్తే విశేష ఫలితాలను పొందవచ్చని పండితులు చెబుతున్నారు. పరమేశ్వరుడి ఆలయాలు సందర్శించడం కూడా మంచిదని చెబుతున్నారు.