Site icon HashtagU Telugu

Magha Masam: మాఘమాసంలో పొరపాటున కూడా కొనుగోలు చేయకూడనివి ఇవే?

Mixcollage 14 Feb 2024 08 53 Pm 8995

Mixcollage 14 Feb 2024 08 53 Pm 8995

మాఘమాసం వచ్చింది. ఈ మాఘమాసంలో ఎక్కువగా పరమేశ్వరున్ని, విష్ణుమూర్తిని,శ్రీకృష్ణున్ని పూజిస్తూ ఉంటారు. పుష్య పూర్ణిమ నుంచి మాఘ పూర్ణిమ వరకు మాఘ స్నానం చాలా పవిత్రమైందిగా భావిస్తారు. ఈ సమయంలో పవిత్ర నదుల్లో స్నానం చేయడం వల్ల విష్ణువుతో పాటు లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుందని నమ్ముతారు. కృష్ణ పక్షం ప్రతిపాద తిథి నాడు మాఘ మాసం ప్రారంభమవుతుంది. ఈ ఏడాది జనవరి 26న మాఘమాసం ప్రారంభమైంది. ఇది ఫిబ్రవరి 24న మాఘ పౌర్ణమితో ముగుస్తుంది. ఈ మాసం చాలా ముఖ్యమైనది. పవిత్రమైంది కూడా. ఎందుకంటే ఈ సమయంలో ఎన్నో పండుగలను జరుపుకుంటారు.

దీనితో పాటుగా ఈ మాసంలో మనం పాటించాల్సిన ఎన్నో నియమాలు కూడా ఉన్నాయి. ఆ నియమాలను పాటించడం వల్ల సంతోషంగా ఉండడంతో పాటు, దేవుడు అనుగ్రహం కలిగి కష్టాల సమస్యల నుంచి బయటపడవచ్చు. అయితే మాఘమాసంలో కొన్నింటిని అసలు కొనుగోలు చేయకూడదట. మరి మాఘ మాసంలో ఎలాంటి వస్తువులు కొనుగోలు చేయకూడదు అన్న విషయానికొస్తే.. మాఘ మాసంలో మనం చేయకూడనివి చాలానే ఉన్నాయి. నాణేలు, వెండి పాత్రలు, ఇత్తడి పాత్రలను ఈ మాసంలో కొనకూడదని నమ్ముతారు. అలాగే ఈ నెలలో ముల్లంగిని తినకూడదు. మాంసాన్ని కూడా తినకూడదు. ముఖ్యంగా ఆల్కహాల్ ను తాగకూడదు.

ఈ నియమాలను పాటిస్తే మీ జీవితం ఆనందంగా సాగుతుంది. లేదంటే కష్టాలను ఎదుర్కోవాల్సి వస్తుంది. కాగా మాఘమాసంలో చేయాల్సిన పనులలో నదీ స్నానం కూడా ఒకటి. పుష్య పూర్ణిమ నుంచి మాఘ పూర్ణిమ వరకు మాఘ స్నానం చాలా పవిత్రమైంది. ఈ సమయంలో పవిత్ర నదుల్లో స్నానం చేయడం వల్ల విష్ణువుతో పాటుగా లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుంది. మాఘమాసంలో ఈ మాసంలో నియమాలను పాటిస్తే మీ జీవితంలో సుఖ సంతోషాలు, సౌభాగ్యాలు, మోక్షం లభిస్తాయి. ఈ మాసం మొత్తం శ్రీ హరి విష్ణువు, శ్రీకృష్ణుని ఆరాధనకు అంకితం చేయబడింది.