Lunar Eclipse 2023 in India : 9 ఏళ్ల తర్వాత పాక్షిక చంద్రగ్రహణం..దీని ప్రభావం ఎలా ఉంటుందంటే..!

అక్టోబర్‌ 28వ తేదీన (శనివారం) అర్ధరాత్రి దాటిన తర్వాత 29వ తేదీన ఆరంభం అవుతుంది. భారత కాలమానం ప్రకారం ఎల్లుండి రాత్రి 1.05 గంటల నుంచి 2.22 గంటల మధ్య పాక్షిక చంద్రగ్రహణం

  • Written By:
  • Publish Date - October 27, 2023 / 10:33 AM IST

ఇప్పటికే అక్టోబర్‌ 14వ తేదీన సూర్యగ్రహణం (Solar Eclipse) ఏర్పడిన విషయం తెలిసిందే. కాకపోతే మనదేశంలో పెద్దగా కనిపించలేదు. ఇప్పుడు ఇదే నెలలో చంద్రగ్రహణం (Lunar Eclipse) ఏర్పడనుంది. అక్టోబర్‌ 28వ తేదీన (శనివారం) అర్ధరాత్రి దాటిన తర్వాత 29వ తేదీన ఆరంభం అవుతుంది. భారత కాలమానం ప్రకారం ఎల్లుండి రాత్రి 1.05 గంటల నుంచి 2.22 గంటల మధ్య పాక్షిక చంద్రగ్రహణం ఏర్పడనుంది.

ఈ సమయంలో చంద్రుడికి ఖీర్ ని సమర్పించడం మంచిది కాదని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు చెబుతున్నారు. ఈ చంద్రగ్రహణం ప్రభావం భారత్ పై కూడా పడబోతోంది. కాబట్టి ఈ సమయంలో సూతక్ కాలం కూడా చెల్లుబాటు అవుతుంది. అయితే ఈ సమయంలో ఎలాంటి మతపరమైన కార్యక్రమాలు చేయకూడదని శాస్త్ర నిపుణులు సూచిస్తున్నారు. చంద్రగ్రహణ ప్రభావంతో కొన్ని రాశుల వారికి మంచి జరిగితే.. అదే సమయంలో కొన్ని రాశుల వారికి కష్టాలు, ఇబ్బందులు కలగనున్నాయని అంటున్నారు.

ఈ చంద్రగ్రహణం భారత్ (India) తో పాటు, అట్లాంటిక్ మహాసముద్రం, హిందూ మహాసముద్రం, పశ్చిమ, దక్షిణ పసిఫిక్ మహాసముద్రం, ఆఫ్రికా, యూరప్, ఆసియా, ఆస్ట్రేలియా, దక్షిణ అమెరికాలోని తూర్పు, ఉత్తర ప్రాంతాలలో పాక్షిక చంద్రగ్రహణం కనిపించనుంది. చంద్రగ్రహణం మొత్తం 16 దిశల్లో కనిపిస్తుంది. ఈ చంద్రుని నుంచి వచ్చే కిరణాలు అమృతాన్ని చిమ్ముతున్నట్లుగా కనిపిస్తాయని సమాచారం. దాదాపు 9 ఏళ్ల క్రితం కూడా ఇలానే ఏర్పడిందని ఖగోళ శాస్త్ర నిపుణులు చెబుతున్నారు. అయితే ఈ చంద్రగ్రహణం ప్రభావం అన్ని రాశుల వారిపై కూడా పడే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి జ్యోతిష్య శాస్త్ర నిపుణులు సూచించిన కొన్ని రాశుల వారు తప్పకుండా పలు రకాల జాగ్రత్తలు పాటించాలని సూచిస్తున్నారు.

We’re now on WhatsApp. Click to Join.

మేష రాశి: ఈ రాశి వారిపై చంద్రగ్రహణ ప్రభావం పడనుంది. కుటుంబ సభ్యులతో విబేధాలు ఏర్పడే అవకాశం ఉంది. పిల్లలు తమ తల్లిదండ్రులతో విబేధించే అవకాశం ఉంది. అయితే పోటీ పరీక్షల్లో పాల్గొనే స్టూడెంట్స్ ఈజీగా సక్సెస్ అందుకుంటారు.

మిధున రాశి: ఈ రాశి వారు ఆర్ధిక సమస్యల నుంచి ఈజీగా బయటపడనున్నారు. అంతేకాదు ఈ చంద్రగ్రహణం ఈ రాశివారికి శుభప్రదంగా ఉంటుంది. అంతేకాదు ఇతరుల మద్దతుతో ఎలాంటి పనులను అయినా ఈజీగా చేయగలరు.

వృషభ రాశి: ఈ వారు మానసికంగా ఇబ్బందులు పడే అవకాశం ఉంది. ఆర్ధిక కష్టాలు ఎదుర్కోవాల్సి వస్తుంది. అంతేకాదు చంచల మనసుతో తీసుకునే నిర్ణయాలతో తీవ్ర ఇబ్బందులను ఎదుర్కోవాల్సి ఉంటుంది.

సింహ రాశి: ఈ రాశి వారిపై చంద్రగ్రహణం పడనుంది. కొన్ని సమస్యలను ఎదుర్కోనున్నారు. ఆత్మవిశ్వాసం తగ్గి చేపట్టిన పనులల్లో ఇబ్బందులు ఎదుర్కొంటారు. కుటుంబ సభ్యులతో సమస్యలు ఏర్పడి హెచ్చుతగ్గులు కలిగే అవకాశం ఉంది. అయితే మాతృత్వం కోసం ఎదురు చూస్తున్న ఈ రాశికి చెందిన స్త్రీలు శుభవార్త వినే అవకాశం ఉంది.

కర్కాటక రాశి: ఈ రాశివారిపై చంద్రగ్రహణం ప్రభావం పడనుంది. ఈ సమయంలో ఆత్మవిశ్వాసం లోపించి ఆందోళనతో ఉంటారు. బంధువులు, సన్నితులతో సమస్యలు ఏర్పడే అవకాశం ఉంది. కనుక ఇతరులతో ఉండే సమయంలో స్వీయ నియంత్రణ ఉండాల్సి ఉందని జ్యోతిష్య నిపుణులు వెల్లడించారు.

Read Also : Trains Cancelled : నవంబరు 5 వరకు ఈ ట్రైన్స్ రద్దు