Site icon HashtagU Telugu

Lucky Zodiac Signs: గురు గ్రహ సంచారంతో ఆ రాశుల వారు పట్టిందల్లా బంగారమే.. అనుకున్నది నెరవేరడం ఖాయం?

Mixcollage 05 Dec 2023 04 15 Pm 8221

Mixcollage 05 Dec 2023 04 15 Pm 8221

మామూలుగా గ్రహాల కదలికలు మనిషి జీవితాన్ని ప్రభావితం చేస్తాయి అన్న విషయం మనందరికీ తెలిసిందే. అలా గ్రహాల కదిలిక సమయంలో కొన్ని కొన్ని సార్లు కొన్ని రాశుల వారికి అదృష్టయోగం పట్టిపీడిస్తూ ఉంటుంది. అలా గురుగ్రహం కారణంగా కొన్ని గ్రహాలను అదృష్టం వరించనుందట. మరి గురు గ్రహం కారణంగా ఏ రాశి వారికి అదృష్టం వరించనుంది. ఆ రాశులు ఏవేవో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. కాగా గురు భగవానుడి వక్ర గమనం ఈ నెల 31న మొదలవుతుంది. ఆ తర్వాతి మేలో 12ఏళ్ల తర్వాత గురు గ్రహం వృషభ రాశిలోకి ప్రవేశించనుంది. ఫలితంగా కొన్ని రాశుల వారికి రాజయోగం మొదలవుతుంది.

సింహ రాశి వారు కష్టాల నుంచి బయటపడతారు. క్లిష్ట పరిస్థితుల్లో విజయం సాధిస్తారు. అదృష్టం అనేది ఆకస్మికంగా, ఊహించని విధంగా ఎదురవుతుంది. ఆస్తి చుట్టూ ఉన్న సమస్యలు దూరమవుతాయి. వైవాహిక బంధంలో సంతోషం పెరుగుతుంది. పెళ్లి కాని వారు శుభవార్త వింటారు. అదేవిధంగా కన్యా రాశి వారికీ కూడా వారు అనుకున్న కోరికలు నెరవేరుతాయి. అలాగే జీవితంలో ఉండే అడ్డంకులన్నీ తొలగిపోతాయి. సంతోషంగా జీవిస్తారు. నిరుద్యోగులకు శుభవార్త అందుతుంది. కుటుంబంలో సంతోషం పెరుగుతుంది. అలాగే తులా రాశి వారికి కూడా 2024 అద్భుతంగా ఉండబోతోంది. వ్యాపారంలో మంచి లాభాలు వస్తాయి.

ధన లాభం కూడా ఉంటుంది. నిరుద్యోగులకు ఉద్యోగాలు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కుటుంబంలో సంతోషం కూడా పెరుగుతుంది. వైవాహిక బంధం ప్రశాంతంగా ఉంటుంది. అలాగే వృశ్చిక రాశి వారిని కూడా అదృష్టం వరించనుంది. గురు భగవానుడు అద్భుతమైన ఫలితాలను అందించనున్నాడు. ఎటువంటి పని చేసినా కూడా రెట్టింపు ఫలితాలు కనిపిస్తాయి. అలాగే భార్యాభర్తల మధ్య ఉండే గొడవలు తొలగిపోతాయి.