Lucky Zodiac Sign: కొత్త ఏడాది 2026 అద్భుతంగా ప్రారంభమైంది. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం.. ఈ సంవత్సరంలోని మొదటి రోజు చాలా ముఖ్యమైనది. ఎందుకంటే ఉదయాన్నే చంద్రుని సంచారం జరగడంతో పాటు రోజంతా మూడు శుభ యోగాలు ఏర్పడుతున్నాయి. మొదటిది ‘శుభ’ యోగం ఉదయం నుండి సాయంత్రం 5 గంటల వరకు ఉంటుంది. ఆ తర్వాత ‘శుక్ల’ యోగం ప్రారంభమై రాత్రి వరకు కొనసాగుతుంది. ఇక రాత్రి 11 గంటల ప్రాంతంలో ‘రవి’ యోగం మొదలై కొత్త ఏడాది రెండో రోజు వరకు ఉంటుంది.
దృక్ పంచాంగం ప్రకారం.. శుభ, శుక్ల, రవి యోగాల సానుకూల ప్రభావం వల్ల కొత్త ఏడాది మొదటి రోజు నుండి కొన్ని రాశుల వారికి విశేష ప్రయోజనాలు కలగనున్నాయి. 2025తో పోలిస్తే ఈ ఏడాది ఏ మూడు రాశుల వారికి అదృష్టం వరిస్తుందో చూద్దాం.
మేష రాశి
మేష రాశి వారికి 2026 సంవత్సరం ఎంతో ఆనందదాయకంగా ఉంటుంది. ఒకవైపు మీ పనులు సజావుగా సాగడమే కాకుండా మరోవైపు మీ బంధాలను మెరుగుపరుచుకునే అవకాశం లభిస్తుంది. అదనంగా ఈ ఏడాది మీరు ఎటువంటి పెద్ద ఆర్థిక సంక్షోభాలను ఎదుర్కోవాల్సిన అవసరం ఉండదు. ఏదైనా కొత్త పనిని ప్రారంభించడానికి నేటి రోజు, రాబోయే కాలం మేష రాశి వారికి ఎంతో మేలు చేస్తుంది.
Also Read: ఏపీ ప్రభుత్వానికి మంచి కిక్కు ఇచ్చిన న్యూ ఇయర్ మద్యం అమ్మకాలు
మిథున రాశి
మేష రాశి వారితో పాటు మిథున రాశి వారి జాతకం కూడా 2026లో అద్భుతంగా ఉండబోతోంది. మీరు ఆర్థిక లాభాలను గడించడానికి అనేక అవకాశాలను పొందుతారు. పని విషయంలో స్థిరత్వం లభిస్తుంది. ఇక సంబంధాల విషయానికొస్తే.. వీరు ఎటువంటి ఆందోళనలు లేకుండా ప్రశాంతంగా ఉంటారు. కొత్త ఏడాదిలో యువతకు సంబంధించిన ఏదైనా పెద్ద కోరిక నెరవేరే అవకాశం ఉంది.
ధనుస్సు రాశి
శుభ, శుక్ల, రవి యోగాల కలయిక ధనుస్సు రాశి వారికి కొత్త ఏడాది మొదటి రోజున ఎంతో శుభప్రదంగా ఉంటుంది. రోజు ముగిసేలోపు మీ ఏదైనా ఒక ముఖ్యమైన పని పూర్తవుతుంది. ఇది మీకు ఎంతో సంతోషాన్నిస్తుంది. అంతేకాకుండా మీ జీవిత భాగస్వామి నుండి మీకు నచ్చిన బహుమతిని అందుకుంటారు. ఉద్యోగస్తులకు నగరం వెలుపల పనిచేసే అవకాశాలు వస్తాయి. దీని ద్వారా మంచి ఆర్థిక లాభం కలుగుతుంది.
