మామూలుగా మనం నిద్రపోతున్నప్పుడు ఎన్నో రకాల కలలు ఉంటాయి. అందులో కొన్ని మంచి కలలు ఉంటే మరికొన్ని చెడ్డలు కలలు కూడా ఉంటాయి. కలలో వచ్చే కొన్ని విషయాలు మనకు భవిష్యత్తుని సూచిస్తాయి అనడంలో ఎటువంటి సందేహం లేదు. స్వప్నశాస్త్ర ప్రకారం మనకు కలలో వచ్చే కొన్ని రకాల విషయాలు భవిష్యత్తును సూచిస్తాయి. మాములుగా ప్రతి ఒక్కరు లక్ష్మీదేవి అనుగ్రహం కలగాలని, లక్ష్మీదేవి ఇంట్లో నివసించాలని కోరుకుంటూ ఉంటారు. అంతేకాకుండా లక్ష్మీదేవి అనుగ్రహం కోసం ఎన్నో రకాల నియమాలను, పూజలను వ్రతాలను చేస్తూ ఉంటారు.
అయితే వాటితో పాటుగా కలలో మనకు ఇటువంటి కలలు వస్తే మాత్రం లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుందని అర్థం. మరి ఆ కలలు ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. ఒకవేళ మీకు కలలో వర్షం పడుతున్నట్టు కనిపిస్తే త్వరలో మీపై సంపద వర్షంలో కురుస్తుంది అని అర్థం. అలాగే మీ ఆర్థిక స్థితి మెరుగవుతుంది అనడానికి సూచన అని చెప్పవచ్చు. త్వరలో కష్టాలు తొలగి ఆనందాలు మీ సొంత కాబోతున్నాయని అర్థం.. అదేవిధంగా స్త్రీలకు కలలో ఎర్ర చీర కట్టుకున్నట్టు ధరించినట్టు వస్తే త్వరలోనే వారికి లక్ష్మీ కటాక్షం కలగబోతుందని అర్థం. ఇక కలలో పసుపు రంగు ఉండే పండు కనిపిస్తే అదృష్టం త్వరలోనే రాబోతోంది అని అర్థం. కలలో పసుపు రంగు పండు కనిపిస్తే అది లక్ష్మీ ఆగమనానికి సంకేతమట.
అలాగే కలలో ఎరుపురంగు పువ్వులు కనిపించినా కూడా మీకు ఆర్థిక ఇబ్బందులు త్వరలో తొలగిపోతున్నాయని అర్థం. కొన్ని కొన్ని సార్లు కలలో మనం దేవాలయాలను సందర్శించినట్టు కలలు వస్తూ ఉంటాయి. అలా రావడం అన్నది చాలా శుభప్రదం. స్వప్న శాస్త్ర ప్రకారం ఆలయ సందర్శనం వల్ల నిజజీవితంలోని సమస్యలు తొలగిపోతాయి. ఇలాంటి కలల వల్ల లక్ష్మి కుబేర ఆశీస్సులు లభిస్తాయి. ఒకవేళ మీకు కలలో బావి లేదా చిన్న గొయ్యి గుంట లాంటిది కనిపిస్తే అది నిక్షిప్తం చేసిన నిధికి సంకేతంగా భావించాలి. అలాంటి కల వస్తే త్వరలోనే మీకు అదృష్టం పట్టిపీడిస్తుందని అర్థం.
కలలో పువ్వులు కనిపిస్తే చాలా శుభప్రదం. కోసిన పువ్వులు, లేదా పువ్వుల చెట్టు వంటివి కనిపిస్తే త్వరలో చాలా మంచి రోజులు రానున్నాయని అర్థం. ఇది మీ ఆర్థిక కష్టాలకు త్వరలోనే తెరపడనుందని అనడానికి ఇది సంకేతం. చాలా సార్లు పర్వతం ఎక్కుతున్నట్టు కలలు వస్తాయి. ఇలాంటి కలలు పవిత్రమైనవి. జీవితంలో పురోగతి కోసం కొత్త దారులు ఏర్పడబోతున్నాయని అర్థం. ఉద్యోగస్తులు చాలా మంచి మార్పులు కలుగవచ్చు. వ్యాపారంలో ఉన్న వారికి మంచి లాభాలు వస్తాయనేందుకు సంకేతంగా భావించాలి.