Site icon HashtagU Telugu

Lucky Bamboo : అదృష్టం, శుభం కావాలంటే ఈ మొక్క ఇంటికి తెచ్చుకోండి

Lucky Bamboo

Lucky Bamboo

Lucky Bamboo : ఈ బిజీ లైఫ్‌లో ప్రతి ఒక్కరూ ఒత్తిడికి గురవుతున్నారు. ఈవిషయంలో పిల్లల నుంచి పెద్దల వరకు ఎవ్వరికీ మినహాయింపు లేదు. ప్రతి ఒక్కరూ మనశ్శాంతి, ఆనందం, సంపదలను కోరుకుంటారు. అందుకు అంతా సులభమైన పరిష్కారాలను వెతుకుతుంటారు. అలాంటి పరిష్కారాలు వాస్తు శాస్త్రంలో ఉన్నాయి. వాటిలో ముఖ్యమైనది వెదురు మొక్క. దీన్ని అదృష్ట మొక్క(Lucky Bamboo)  అని కూడా అంటారు.

Also read : Rain Alert Today : తెలంగాణలో 10 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్.. ఏపీలో మరో 4 రోజులు వర్షాలు

బుధగ్రహం..  పంచభూతాలు 

వెదురు  మొక్క బుధగ్రహానికి చెందినదని చైనీయులు భావిస్తారు. దీన్ని పంచభూతాలకు ప్రతీకగా భావిస్తారు. ఈ మొక్కను ఇల్లు, ఆఫీసులలో తూర్పు వైపున ఉంచడం వల్ల శుభం కలుగుతుంది. ఇంట్లో ఉన్నవారికి మానసిక ప్రశాంతత చేకూరుతుంది. మానసిక ఒత్తిడి, ఆందోళనలు దరిచేరవు. ఈ మొక్కలోని కాండాలన్నీ ఒకదానితో ఒకటి ముడిపడి ఉన్న విధంగా.. అది ఉండే ఇంట్లోని వారి ప్రేమాభిమానాలు నిలిచి ఉంటాయని నమ్ముతారు. దీనితో అదృష్టం, ఆనందం రెండూ కలుగుతాయి. ఎప్పుడూ పచ్చగా ఉండే వెదురు మొక్క కాలుష్యాన్ని తగ్గించడమే కాదు.. దాన్ని చూసినప్పుడు ఆహ్లాదాన్ని, మనసుకు హాయిని ఇస్తుంది.

Also read : EPFO: మే నెలలో EPFOలో కొత్తగా చేరిన 16.30 లక్షల మంది.. ఈపీఎఫ్‌ఓలో ఈ 5 రాష్ట్రాలే టాప్..!

ఎయిర్ ప్యూరిఫైయర్ ప్లాంట్.. 

తక్కువ నిర్వహణ కలిగిన మొక్కలలో ఇది ఒకటి. వెదురు మొక్క అనేది కార్బన్ డయాక్సైడ్‌ను గ్రహించి ఆక్సిజన్‌ను ఉత్పత్తి చేసే సామర్థ్యానికి ప్రసిద్ధి చెందిన ఎయిర్ ప్యూరిఫైయర్ ప్లాంట్.  వెదురు మొక్క చిన్నగా కనిపించినా.. దాని ధర ఎక్కువగానే ఉంటుంది. ఈ మొక్క ధర  నర్సరీల్లో 200 నుంచి 2000 రూపాయల ధర వరకు ఉంటుంది. చిన్న వెదురు మొక్కలు మాత్రమే కాదు, మూడు నుంచి నాలుగు అడుగుల పొడవైన మొక్కల వరకు అందుబాటులో ఉన్నాయి. ఈ మొక్కను గాజు కుండీలో పెట్టుకుంటే చాలా బాగుంటుంది.  ఈ మొక్కకు ఎక్కువ నీళ్లు అవసరం ఉండవు. నీళ్లు ఎక్కువైతే ఇది కుళ్లిపోతుంది. దీనిపై  నేరుగా సూర్య కాంతి పడకుండా జాగ్రత్త పడాలి. మొక్కలో ఏదైనా భాగం ఎండిపోయినా, కుళ్లిపోయినా తొలగించాలి.

గమనిక: ఈ కథనంలో ఉన్న ఏదైనా సమాచారం/మెటీరియల్/లెక్కల యొక్క ఖచ్చితత్వం లేదా విశ్వసనీయతకు హామీ లేదు. ఈ సమాచారం వివిధ మాధ్యమాలు/జ్యోతిష్యులు/పంచాంగాలు/ఉపన్యాసాలు/నమ్మకాలు/గ్రంధాల నుండి సేకరించిన తర్వాత మీ ముందుకు తీసుకురాబడింది. మా లక్ష్యం సమాచారాన్ని అందించడం మాత్రమే, దాని వినియోగదారులు దానిని కేవలం సమాచారంగా తీసుకోవాలి. అదనంగా, దాని యొక్క ఏదైనా ఉపయోగం వినియోగదారు యొక్క పూర్తి బాధ్యత.