Site icon HashtagU Telugu

Vasthu Tips: ఆర్థిక ఇబ్బందులతో బాధపడుతున్నారా.. అయితే ఈ 5 రకాల జంతువుల ఫోటోలు ఇంట్లో ఉండాల్సిందే!

Vasthu Tips

Vasthu Tips

మామూలుగా ప్రతి ఒక్కరికి ఏదో ఒక సమయంలో ఆర్థిక సమస్యలు ఇబ్బంది పడుతూనే ఉంటాయి. ఎంత సంపాదించినా కూడా డబ్బులు చేతిలో చిల్లి గవ్వ కూడా మిగలదు. అయితే ఆర్థిక సమస్యల నుంచి బయటపడడం కోసం ఎన్నో రకాల పూజలు పరీహారాలు దానధర్మాలు వంటి కూడా చేస్తూ ఉంటారు. అయినప్పటికీ కొన్ని కొన్ని సార్లు వాటి వల్ల ఎలాంటి ఫలితం ఉండదు. అలాంటప్పుడు ఇప్పుడు చెప్పబోయే ఐదు రకాల జంతువుల విగ్రహాలను ఇంట్లో ఉంచుకోవాల్సిందే అంటున్నారు. ఇంతకీ ఆ ఐదు రకాల విగ్రహాలు ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం..

ఏనుగు.. ఏనుగును లక్ష్మీదేవి వాహనంగా చెబుతూ ఉంటారు. ఏనుగు కలలో కనిపిస్తే మంచి జరుగుతుందని అంటూ ఉంటారు. ఏనుగు బొమ్మలు లేదా చిత్రపటాలు ఇంట్లో ఉంటే సానుకూల శక్తి ప్రసరిస్తుందట. కాబట్టి ఇంట్లో ఏనుగు పటాలు లేదా విగ్రహాలు పెట్టుకోవడం మంచిది అని చెబుతున్నారు..

కప్పలు.. ఫెంగ్ షుయ్ సిద్ధాంతం ప్రకారం కప్పలు ఇంటికి ధనాన్ని కర్షిస్తాయట. కప్ప ఫొటోలు గానీ, బొమ్మలను గానీ ఇంట్లో ఉంచితే ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయని చెబుతున్నారు. ధనాన్ని ఆకర్షించడానికి, కప్పలకు ప్రత్యేక సంబంధం ఉందని పండితులు చెబుతున్నారు.

గోల్డ్ ఫిష్.. అలాగే చాలామంది ఇళ్లలో పెద్దపెద్ద అక్వేరియాలు ఏర్పాటు చేసుకుంటూ ఉంటారు. దీన్ని చూసినప్పుడు చాలా ప్రశాంతంగా మనశ్శాంతిగా అనిపిస్తూ ఉంటుంది. అయితే ఈ అక్వేరియంలో గోల్డ్ ఫిష్ పెంచుకోవడం చాలా మంచిదని చెబుతున్నారు. గోల్డ్ ఫిష్ ఇంట్లో పెంచితే పాజిటివ్ ఎనర్జీ లభిస్తుందట. ఇవి ధనాన్ని కూడా పెంచుతాయని, కాబట్టి ఇంట్లో ఎన్ని రకాలు చేపలు ఉన్న గోల్డ్ ఫిష్ తప్పనిసరిగా ఉండాలి అని చెబుతున్నారు.

గుర్రం.. జ్యోతిష్య శాస్త్ర ప్రకారం అశ్విని దేవతలను గుర్రాలతో పోలుస్తూ ఉంటారు.. వీరిని తధాస్తు దేవతలు అని కూడా అంటూ ఉంటారు. అయితే గుర్రం పెయింటింగ్స్ ని ఇంట్లో పెట్టుకునే వారికి ఏదో ఒక రూపంలో లక్ కలిసి వస్తుందట. మేష రాశి వారికి ఇదెంతో మేలు చేస్తుందట. ఈ పెయింటింగ్స్ ఇంట్లో ఉంటే వారి కెరీర్ లో కూడా ఊహించని మార్పులు, మంచి ఫలితాలు చూడవచ్చు అని చెబుతున్నారు.

తాబేలు.. తాబేలు నిలకడకు సంకేతంగా భావించాలి. ఇంట్లో ధనం నిలకడగా ఉండాలి అనుకున్న వారు తాబేలు ఉమ్మలను వ్యాపార స్థలాలు పెట్టుకోవడం మంచిదని చెబుతున్నారు. ముఖ్యంగా తూర్పుముఖంగా చూసేలా ఉండడం చాలా మంచిదని చెబుతున్నారు.