Site icon HashtagU Telugu

Bathing: స్నానం చేసే నీళ్లలో ఈ ఒక్కటి వేసుకొని చేస్తే చాలు.. అదృష్టం మారిపోవడం ఖాయం!

Bathing

Bathing

స్నానానికి వెళ్లినప్పుడు మీరు స్నానం చేసే బకెట్లో ఒక్కటి కలుపుకొని స్నానం చేస్తే అదృష్టం మారిపోవడంతో పాటు నెగటివ్ ఎనర్జీ తొలిగిపోతుందని పండితులు చెబుతున్నారు. మరి ఇంతకీ ఏం కలుపుకోవాలి? ఎలా స్నానం చేయాలి అన్న విషయానికి వస్తే.. స్నానం చేసే నీటిలో తులసి ఆకులను వేసి స్నానం చేయడం వల్ల మానసిక ప్రశాంతత కలుగుతుందట. తులసి స్వచ్చతకు చిహ్నం. మానసిక ప్రశాంతత పొందుతారని చెబుతున్నారు. అలాగే స్నానం చేసే నీటిలో లావెండర్‌ ఆయిల్‌ వేసి స్నానం చేయడం వల్ల మీలో వచ్చే ఆలోచనలు తగ్గిపోతాయట.

మానసిక ప్రశాంతతను నియంత్రిస్తుందని చెబుతున్నారు. అంతేకాదు స్నానం చేసే నీటిలో ఇంట్లో ప్రతి కూలతలు తొలగిపోతాయని చెబుతున్నారు. అలాగే సానుకూలత కూడా పెరుగుతుంది. పసుపు వల్ల జీవితంలో ఎన్నో క్వాలిటీలు పెరుగుతాయి. ముఖ్యంగా లీడర్‌ షిప్‌ క్వాలిటీస్‌ పెరుగుతాయట. అలాగే స్నానం చేసే నీటిలో చిటికెడు ఉప్పు వేసి స్నానం చేయడం వల్ల గ్రహ దోషాలను తొలగిస్తుందట. ఇలా చేయడం వల్ల వ్యక్తి యొక్క అదృష్టం కూడా మారుతుందని పండితులు చెబుతున్నారు.

స్నానం చేసే నీటిలో గులాబీ రేకులు వేసి స్నానం చేయడం వల్ల జీవితంలో శాంతి పెరుగుతుందట. అంతేకాదు వైవాహిక జీవితంలో సఖ్యత నెలకొంటుందని చెబుతున్నారు. అలాగే స్నానం చేసే నీటిలో పాలు వేసుకుని చేయడం వల్ల ఎన్నో ప్రయోజనాలు కలుగుతాయట. ముఖ్యంగా మానసిక ప్రశాంతత పెరుగుతుందని, స్నానం చేసే నీటిలో రెండు చుక్కల పాలు వేసుకుని స్నానం చేస్తే చాలా మంచిదని చెబుతున్నారు. స్నానం చేసే నీటిలో తేనె కలిపి చేయడం వల్ల శుక్ర బలం పెరుగుతుందట. అలాగే ఆర్థిక సంక్షోభ నుంచి బయటపడవచ్చు అని చెబుతున్నారు. అంతేకాదు స్నానం చేసే నీటిలో కొబ్బరినీరు వేసి చేయడం వల్ల మానసిక ప్రశాంతత కలుగుతుందట. ఒత్తిడి కూడా తగ్గుతుంది. జీవితంలో శాంతి కలుగుతుందని చెబుతున్నారు.