Site icon HashtagU Telugu

Luck Signs: మీకు ఈ సంకేతాలు కనిపించాయా.. అయితే అదృష్టం వరించినట్లే?

Mixcollage 26 Dec 2023 06 21 Pm 8486

Mixcollage 26 Dec 2023 06 21 Pm 8486

మామూలుగా ప్రతి ఒక్కరూ కూడా జీవితంలో కష్టపడి పైకి ఎదగాలి అని కోరుకోవడంతో పాటు ఎప్పుడో ఒకసారి అదృష్టం మారబోదా అని ఎంతో ఆశగా ఎదురు చూస్తూ ఉంటారు. స‌మాజంలో ఉన్న‌త స్థాయికి చేర‌డానికి, పురోగతి సాధించడానికి స‌రైన‌ సమయం రావాల‌నుకుంటారు. అయితే మరి ఆ సమయం ఎప్పుడు వస్తుంది వచ్చినప్పుడు ఎలాంటి సంకేతాలు కనిపిస్తాయి అన్న విషయాలు చాలామందికి తెలియదు. అయితే అలా మీకు అదృష్టం వరించబోతోంది, అదృష్టం పట్టిపీడించబోతుంది అని తెలిపే ముందు కొన్ని రకాల సంకేతాలు కనిపిస్తాయి అంటున్నారు పండితులు. ఆ సంకేతాలు ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం..

కొత్త జంట.. మీరు ఏదో ఒక పని నిమిత్తం ఉదయాన్నే ఇంటి నుంచి బ‌య‌ట‌కు వెళుతున్న‌ప్పుడు, దారిలో కొత్త జంటను మీకు ఎదురైతే మీ మంచి సమయం ప్రారంభం కాబోతోందని అర్థం. అంటే మీకు మంచి రోజులు ప్రారంభానికి దీనిని శుభ సంకేతంగా పరిగణిస్తారు. పక్షి స్పర్శ.. అలాగే ఏదైనా పక్షి వచ్చి మిమ్మ‌ల్ని తాకినా, లేదా వాలినా దిగులు చెంద‌వ‌ల‌సిన‌ అవసరం లేదు. ఎందుకంటె అది మీకు మంచి రోజులు రాబోతున్నాయనడానికి సంకేతం. పక్షి ఒక వ్యక్తిని తాకినప్పుడు, అతని అదృష్టం మొదలవుతుందని బ‌లంగా నమ్ముతారు.

ఈ జంతువుల‌ను చూడటం.. మీరు ప్రయాణాలు చేస్తున్న‌ సమయంలో పాములు, కోతులు కనిపిస్తే, అది మంచి సమయానికి శుభసూచకం. ఇది మీ జీవితంలో ఆర్థిక సంక్షోభాన్ని తొలగిస్తుంది. మీ ఇంట్లోకి ధన ప్రవాహం ప్రారంభం కావ‌చ్చు. అంతేకాకుండా ఇంట్లో గబ్బిలం గూడు ఉంటే శుభప్రదంగా భావించాలి. రాలుతున్న నక్షత్రం.. అలాగే సాయంత్రం సమయంలో అలా మనం మేడపై కూర్చుని ఆకాశం వైపు చూస్తున్నప్పుడు కొన్ని కొన్ని సార్లు నక్షత్రాలు పడటం మనం గమనించే ఉంటాం. అలా నక్షత్రం రావడం మీరు చూస్తే మీ కోరిక‌ వెంటనే నెర‌వేర‌బోతోంద‌ని సంకేతం. ఎంత‌టి క‌ఠిన‌మైన‌దైనా ఆ కోరిక 30 రోజుల్లో నెరవేరుతుంద‌ని చాలా మంది విశ్వ‌సిస్తారు.

తాబేలు.. అదేవిధంగా తాబేలును చూడటం మంచి సంకేతం. తాబేలును కూర్మం అని కూడా అంటారు. కూర్మావతారం అయిన విష్ణువు అవతారాలలో తాబేలు కూడా ఒకటి. మీకు కలలో తాబేలు క‌న‌బ‌డితే అదృష్టానికి సంకేతం. ఈ విధంగా మీ అదృష్టం ప్రకాశిస్తుంది. నెమలి.. మీరు మీ ఇంటి దగ్గర లేదా రోడ్డుపై నెమలిని చూసినట్లయితే లేదా నెమలి నాట్యం చేయడం చూస్తే ఆ రోజు నుంచి మీకు మంచి రోజులు ప్రారంభమవుతాయి. నెమలిని చూడటం శుభప్రదంగా బావించాలి. ఏనుగు.. మీ ఇంటి ప్రధాన ద్వారం వద్ద ఏనుగు నిలబడితే, లక్షీదేవి మీ ఇంటికి వస్తుందని అర్థం. మీ కుటుంబంలో ఆనందం, శ్రేయస్సు పెరుగుతుంది. ఏనుగును వినాయకుడి ప్ర‌తిరూపంగా భావిస్తారు. కోకిల.. అలాగే ఇంటి పైకప్పు మీద కోకిల కూయడం కూడా శుభసూచకమే. ఇది జరిగితే, మీ సంపద పెరుగుతుంది. ఇది ఇంటికి సంపద రాకకు సూచన. ఇది మీ డబ్బు సమస్యలన్నింటినీ పరిష్కరిస్తుంది. మీకు కలలో లేదా రోడ్డుపై బంగారు రంగు పాము కనిపిస్తే, మీకు మంచి రోజులు ప్రారంభం కానున్నాయి. ఇది అదృష్టానికి చిహ్నంగా పరిగణించాలి..