Vastu tips: లక్ష్మీదేవి అనుగ్రహం కలగాలంటే తామరపువ్వుతో ఇలా చేయాల్సిందే?

ప్రతి ఒక్కరూ జీవితంలో కష్టపడి పైకి ఎదగాలని అలాగే ఆర్థిక ఇబ్బందులు లేకుండా సిరిసంపదలతో ఆయురారోగ్యాలతో

  • Written By:
  • Publish Date - November 23, 2022 / 06:00 AM IST

ప్రతి ఒక్కరూ జీవితంలో కష్టపడి పైకి ఎదగాలని అలాగే ఆర్థిక ఇబ్బందులు లేకుండా సిరిసంపదలతో ఆయురారోగ్యాలతో జీవించాలని లక్ష్మీదేవి అనుగ్రహం కలగాలని ఎన్నో రకాల పూజలు చేస్తూ ఉంటారు. లక్ష్మీదేవి అనుగ్రహం తమపై ఉండాలని లక్ష్మీదేవి తన ఇంట్లో కొలువై ఉండాలని కోరుకుంటూ ఉంటారు. కొంతమంది ఇందుకోసం లక్ష్మీదేవి కు ఎన్నో రకాల పూజలు చేస్తూ ఉంటారు. అయితే లక్ష్మీదేవికి ఇష్టమైన వస్తువులలో తామర పువ్వు కూడా ఒకటి. తామరపువ్వు విష్ణువుమూర్తి చేతిలో ఉండే పుష్పం. ఈ తామర పువ్వు లక్ష్మిదేవికి ఆసనం. తామర పువ్వుకు డబ్బును ఆకర్షించే శక్తి ఉంటుంది. మరి తామరపువ్వు తో లక్ష్మీదేవిని ఏ విధంగా పూజించాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం..

లక్ష్మీదేవికి తామర పువ్వు అంటే ఎంతో ఇష్టం కాబట్టి ప్రతి శుక్రవారం రోజున తామర పువ్వును లక్ష్మీదేవి పాదాల వద్ద పెట్టి పూజ చేయాలి. ఇలా ఐదు శుక్రవారాలు వరుసగా చేస్తే మంచి ఫలితాలు కనిపిస్తాయి. డబ్బుకు సంబంధించిన సమస్యలు. అలాగే కుటుంబ కలహాలతో బాధపడేవారు బుధవారం రోజు తామర పువ్వుకు చందనాన్ని పూసి ఆ తర్వాత లక్ష్మీదేవి గణేష్ ని పాదాల వద్ద సమర్పించాలి. ఈ విధంగా 11 వారాలు చేయడం వల్ల ఇంట్లో కలహాలు తొలగిపోయి ఆనందంగా ఉంటారు. కోరిన కోర్కెలు నెరవేరాలి అంటే తామర పువ్వును ఒక వారం రోజులపాటు ఆ పరమ శివుడికి శివలింగంపై సమర్పించాలి.

ఈ విధంగా చేయడం వల్ల కోరిన కోరికలు నెరవేరుతాయి. అదేవిధంగా తామర పువ్వులో నెగటివ్ ఎనర్జీని దూరం చేసే గుణం ఉంటుంది. కాబట్టి శుక్రవారం రోజున లక్ష్మీదేవికి తామర పువ్వులు సమర్పించడం వల్ల ఇంట్లోకి దుష్ట శక్తులు ప్రవేశించవు. అలాగే మీరు అనుకున్న పని విజయవంతం కావాలి అంటే లక్ష్మీదేవిని కలువ పువ్వుతో పూజించాలి. పూజ తరువాత ఆ పువ్వును ఎర్రటి బట్టలో కట్టి అల్మారా లో ఉంచాలి. దీపావళి పండుగ రోజున తామర పువ్వులు లక్ష్మీదేవికి సమర్పించి పూజ చేయడం వల్ల మంచి జరుగుతుంది. ఎల్లప్పుడూ లక్ష్మీదేవి తామర పువ్వు పై కూర్చున్న ఫోటోకి పూజ చేయడం మంచిది.