Thursday Puja Tips: ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్నారా.. అయితే గురువారం ఇలా చేయాల్సిందే?

హిందూమతంలో ఆర్థిక ఇబ్బందులను తొలగించుకోవడానికి ఎన్నో రకాల పరిహారాలు చెప్పబడ్డాయి. అందులో కొన్ని రకాల పరిహారాలు పాటించడం వల్ల ఆర్థిక సమ

  • Written By:
  • Publish Date - August 21, 2023 / 09:45 PM IST

హిందూమతంలో ఆర్థిక ఇబ్బందులను తొలగించుకోవడానికి ఎన్నో రకాల పరిహారాలు చెప్పబడ్డాయి. అందులో కొన్ని రకాల పరిహారాలు పాటించడం వల్ల ఆర్థిక సమస్యలను దూరం చేసుకోవచ్చు. ఇందుకోసం కొన్ని వారాలలో కొన్ని రకాల పరిహారాలు పాటించడం వల్ల ఆ సమస్యల నుంచి బయటపడవచ్చు. అయితే ఆర్థిక సమస్యలతో ఇబ్బంది పడుతున్నవారు గురువారం కొన్ని రకాల పరిహారాలు పాటించడం వల్ల ఆ సమస్యల నుంచి బయటపడవచ్చు. హిందూ మతంలో గురువారం విష్ణువు, దేవగురు బృహస్పతి ఆరాధనకు చాలా పవిత్రమైనది. హిందూ విశ్వాసం ప్రకారం ఈ రోజున చేసే పూజలు, దానికి సంబంధించిన చర్యలు జీవితంలోని దుఃఖాన్ని, దురదృష్టాన్ని తొలగించి, సంతోషాన్ని, అదృష్టాన్ని పెంచుతాయని భావిస్తారు.

మీరు మీ కష్టానికి పూర్తి ఫలితాన్ని పొందడం లేదని లేదా ఎన్ని ప్రయత్నాలు చేసినా మీకు తగిన ఫలం లభించడం లేదని భావిస్తే గురువారం దేవగురువు బృహస్పతిని, శ్రీమహా విష్ణువును ఆరాధించాలి. అందుకోసం ఏం చేయాలో ఎప్పుడు మనం తెలుసుకుందాం.. ఆనందం, అదృష్టం కోరుకునే వ్యక్తి ఎరుపు, నలుపు, నీలం మొదలైన వాటిని విడిచిపెట్టి, గురువారం పసుపు బట్టలు ధరించడానికి ప్రయత్నించాలి. ఈ రోజున పసుపు రంగు దుస్తులు ధరించడం వలన వ్యక్తికి బృహస్పతి పూర్తి అనుగ్రహం లభిస్తుంది. పసుపును హిందూ మతంలో చాలా పవిత్రమైనదిగా భావిస్తారు. అందుకే ప్రతి శుభకార్యంలో ఉపయోగించే పసుపును గురువారం స్నానపు నీటిలో కలిపి తీసుకుంటే ఆ వ్యక్తికి అన్నింటా అదృష్టం సొంతం అవుతుంది.

ఈ పరిహారంతో దేవగురువు బృహస్పతి జాతకంలో శుభ ఫలితాలను ఇవ్వడం ప్రారంభిస్తాడు. గురువారం రోజున అరటిచెట్టును పూజిస్తే, జీవితంలో వచ్చే అన్ని రకాల సమస్యలు రెప్పపాటులో తొలగిపోయి సకల సిరి సంపదలు, సౌభాగ్యాలు లభిస్తాయని విశ్వాసం. పెళ్లికాని యువతీ యువకులు గురువారం నాడు ఇలా చేయడం వల్ల పెళ్లికి ఏర్పడే ఉన్న అడ్డంకులు త్వరగా తొలగిపోతాయి. హిందూ మతంలో కేవలం పూజలు, జపము, తపస్సు మాత్రమే కాదు, దేవతామూర్తుల అనుగ్రహం, నవగ్రహాల అనుగ్రహం పొందేందుకు దాన ధర్మాలకు కూడా విశిష్ట స్థానం ఉంది. హిందూ విశ్వాసం ప్రకారం గురువారం ఆలయంలో ఒక బ్రాహ్మణుడికి పసుపు రంగు బట్టలు, పసుపు పండ్లు, శనగ పప్పులు, హిందూ పురాణాలు, కుంకుమ, పసుపు మొదలైన వాటిని దానం చేస్తే జీవితంలో అన్ని ఆనందాలను పొందుతారు.

అలాగే పట్టిందల్లా బంగారం అవుతుంది. అలాగే ఎంత కష్టపడి పనిచేసినా ఆర్థికంగా ఇబ్బందులు తొలగకుండా కష్టాలు పడుతుంటే ఈ సంక్షోభాన్ని అధిగమించడానికి గురువారం రోజున శ్రీ మహావిష్ణువుతో లక్ష్మీ దేవిని సంప్రదాయంగా ప్రత్యేకంగా పూజించాలి. గురువారం అరటిచెట్టు దగ్గర స్వచ్ఛమైన దేశీ నెయ్యితో దీపం వెలిగించడం ద్వారా సంపదలకు దేవత అయిన లక్ష్మీదేవి సంతసించి అనుగ్రహాన్ని ప్రసాదిస్తుంది. అదృష్టాన్ని పెంచుకోవడానికి గురువారం ఈ పరిహారాలను చేయడం ద్వారా దేవ గురువు బృహస్పతి అనుగ్రహం లభిస్తుంది.