Site icon HashtagU Telugu

Shiva: పరమేశ్వరుడి అనుగ్రహం కలగాలంటే శివ పూజ చేసేటప్పుడు ఈ ఒక్క పని చేయాల్సిందే!

Shiva

Shiva

హిందువులు ఎక్కువగా కొలిచే దేవుళ్ళలో పరమేశ్వరుడు కూడా ఒకరు. ఒక్కొక్క ప్రదేశంలో ఒక్కొక్క రూపంలో దర్శనమిస్తూ ఉంటారు పరమేశ్వరుడు. అలాగే ఒక్కొక్క పేరుతో కూడా పిలుస్తూ ఉంటారు. కోరిన కోరికలను వెంటనే తీర్చే దేవుడిగా పరమేశ్వరుడిని భావిస్తూ ఉంటారు. ఇకపోతే సోమవారం రోజు పరమేశ్వరుడికి ప్రీతికరమైన రోజు. ఈ రోజున పరమేశ్వరుడిని భక్తిశ్రద్ధలతో పూజిస్తూ ఉంటారు. వారంలో మొదటి రోజు వచ్చే సోమవారాన్ని శివుడికి కేటాయించారు.

అయితే పురాణాల ప్రకారం పార్వతీదేవి 16 సోమవారాల పాటు ఉపవాసం చేసి పరమేశ్వరుడిని పూజించిందట. అందుకే సోమవారం రోజు చేసే శివుడి పూజ చాలా ప్రత్యేకం అని చెబుతున్నారు. అయితే సోమవారం రోజు చేసే శివ పూజలో సాధారణంగా బిల్వ పత్రాల సమర్పణ, పంచామృత అభిషేకం లేదా రుద్రాభిషేకం వంటివి చేస్తుంటారు. విభూతి నీటితో కూడా అభిషేకం చేస్తుంటారు.

ఎవరికైనా కోరుకున్న కోరికలు నెరవేరాలన్నా, జీవితంలో కష్టాలు, ఇబ్బందులు తొలగిపోవాలన్నా, ఆర్థిక సమస్యలు పోవాలన్నా సోమవారం రోజు శివ పూజ సమయంలో శివ చాలీసా చదవాలని చెబుతున్నారు. బుక్స్ లేవు అనుకున్న వారు సోషల్ మీడియాలో వివిధ ఆధ్యాత్మిక ఛానల్ లలో శివ చాలీసా అందుబాటులో ఉన్నాయి. అయితే సోమవారం రోజు శివ పూజ చేసిన తర్వాత శివ చాలీసా ను పాటించడం వల్ల జీవితంలో సమస్యలు ఆర్థిక సమస్యల నుంచి బయటపడవచ్చు అని చెబుతున్నారు. ఆ పరమేశ్వరుడి అనుగ్రహం కూడా కలుగుతుందని చెబుతున్నారు. కాబట్టి సోమవారం రోజు ఉదయం లేదా సాయంత్రం శివ పూజ ఎప్పుడు చేసినా కూడా శివ చాలీసా ను భక్తితో పఠించాలని పండితులు చెబుతున్నారు. ఇలా చేస్తే ఆయన అనుగ్రహం తప్పకుండా కలుగుతుందట.