Site icon HashtagU Telugu

Monday: సోమవారం రోజు ఈ పనులు ఖచ్చితంగా చేయాల్సిందే అంటున్న పండితులు.. అవేంటంటే!

Monday

Monday

హిందూ ధర్మంలో ఒక్కొక్క దేవుడికి ఒక్కొక్క రోజు అంకితం చేయబడింది. ఆ విధంగా సోమవారం రోజు పరమేశ్వరుడికి అంకితం చేయబడింది. అందుకే సోమవారం ఆ పరమేశ్వరుని భక్తిశ్రద్ధలతో కొలుస్తూ పూజలు చేస్తూ ఉంటారు. సోమవారం రోజున ఆ పరమేశ్వరున్ని భక్తిశ్రద్ధలతో పూజించడం వల్ల కోరిన కోరికల నెరవేరుతాయని నమ్ముతారు. అంతేకాకుండా ఆయన అనుగ్రహం తప్పకుండా కలుగుతుందని చెబుతుంటారు. అయితే పరమేశ్వరుడి అనుగ్రహం కలగాలి అంటే తప్పకుండా సోమవారం రోజు కొన్ని పనులు చేయాల్సింది అంటున్నారు పండితులు.

మరి సోమవారం రోజు ఎలాంటి పనులు చేయాలి అన్న విషయానికి వస్తే.. వైవాహిక జీవితంలో తరచూ సమస్యలు వస్తూ ఉన్నవారు పంచామృతాలతో పరమేశ్వరుడికి అభిషేకం చేయడం వల్ల సమస్యల నుంచి విముక్తి పొందవచ్చు. అయితే పంచామృతలతో అభిషేకం చేస్తున్న సమయంలో ఓం నమశ్శివాయ అనే పంచాక్షరి మంత్రాన్ని పటించాలని చెబుతున్నారు. ఇలా చేస్తే భార్యాభర్తల మధ్య బంధం మరింత బలపడుతుందట.. డబ్బు కూడా ఎటువంటి లోటు ఉండదని చెబుతున్నారు పండితులు. మీరు ఏదైనా సమస్యతో బాధపడుతున్నట్లయితే సోమవారం రోజు శివుడిని ఖచ్చితంగా పూజించాలని చెబుతున్నారు. శివ చాలీసా శివ మంత్రాలను పటించాలట.

ఈ పరిహారాలు పాటిస్తే జీవితంలో వచ్చే అన్ని సమస్యల నుంచి విముక్తి లభిస్తుందని చెబుతున్నారు. అలాగే సోమవారం రోజు ముహూర్తంలో నిద్ర లేచి మొదట శివుని ద్యానంతో రోజున ప్రారంభించాలట. ఆ తర్వాత శివుని పూజించి ముడి బియ్యాన్ని ఒక పేద వ్యక్తికి దానం చేయమని చెబుతున్నారు. ఈ పరిహారం చేయడం వల్ల జాతకంలో చంద్రుడు బలపడతాడట. బలమైన చంద్రుడు ఉండటం వల్ల ఒక వ్యక్తి సంతోషంగా ఉంటాడని పండితులు చెబుతున్నారు. సోమవారం శివారాధన సమయంలో శివ స్తోత్రాన్ని తప్పనిసరిగా పఠించాలి. ఈ స్తోత్రాన్ని పఠించడం వల్ల మీకున్న ప్రతి రోగమూ నయమవుతుందని పండితులు, జ్యోతిష్యులు చెబుతున్నారు. ఈ విధంగా పరమేశ్వరునికి పూజలు చేయడం వల్ల మీరు కోరిన కోరికలు కూడా నెరవేరుతాయి.