Site icon HashtagU Telugu

Lord Shani: అదేంటి.. చెప్పులు దొంగలించబడడం పోగొట్టుకోవడం మంచిదా.. పండితులు ఏం చెబుతున్నారంటే?

Shoes Outside Hindu Temple Kerala India 46596753

Shoes Outside Hindu Temple Kerala India 46596753

మామూలుగా మనం ఏదైనా ఫంక్షన్లకు, శుభకార్యాలకు, పెళ్లిళ్లకు, దేవాలయాలకు వెళ్ళినప్పుడు చెప్పులు పోగొట్టుకోవడం లేదంటే మన చెప్పులు ఇతరులు దొంగలించడం లాంటివి జరుగుతూ ఉంటాయి. ఆ సమయంలో చాలామంది కొత్త చెప్పులు పోయాయి అని తెగ ఫీల్ అవుతూ బాధపడుతూ ఉంటారు. కానీ చెప్పులు పోయినందుకు బాధపడకూడదు సంతోషించాలి అంటున్నారు పండితులు. అదేంటి అనుకుంటున్నారా. మరి పండితులు ఈ విషయం గురించి ఏం చెబుతున్నారో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. చాలామంది దేవాలయాల్లో పాదరక్షలు చోరీ అయితే శని పోయిందని భావిస్తారు. దేవాలయంలో శనివారం బూట్లు, చెప్పులు ఆలయం నుండి పోగొట్టుకుంటే అది మీకు శుభసూచకానికి సంకేతంగా భావించాలి.

రోజు ఆలయంలో బూట్లు లేదా చెప్పులు దొంగిలిస్తే అది మీకు చాలా శుభప్రదమని జ్యోతిష్యులు చెబుతున్నారు. శనివారం రోజున పాదరక్షలు దొంగిలించబడినట్లయితే చెడు కాలం త్వరలో ముగియబోతోందని, భవిష్యత్తులో జీవితంలో సుఖ సంతోషాలు రానున్నాయని అర్థం. అంతేకాదు సమస్యల నుండి కూడా ఉపశమనం పొందుతారని అర్థం. జ్యోతిష్య శాస్త్రంలో శనిశ్వరుడు మానవుని పాదాలలో ఉంటాడని నమ్ముతారు. పాదాలతో శనీశ్వరుడికి ఉన్న సంబంధము వలన పాదరక్షలు, చెప్పులు కూడా శని కారకంగా మారతాయి. అందుకే ఎవరి పాదరక్షలు, చెప్పులు దొంగిలించబడినా లేదా దానం చేసినా శనీశ్వరుడు ఆశీర్వాదం మీపై ఉంటుందని, అతను సంతోషంగా ఉంటాడని నమ్ముతారు.

అలాగే ఆ శనీశ్వరుడు ఆశీర్వదం తప్పక లభిస్తుందని నమ్మకం. అదేవిధంగా శనీశ్వరుడు ఎవరి జాతకంలో అశుభ స్థానంలో ఉంటాడో వారికి కష్టాలు ఏర్పడతాయి. ఏ పని చేపట్టినా విజయం లభించదు. అటువంటి పరిస్థితిలో ఎవరి బూట్లు, చెప్పులు అయినా శనివారం ఆలయం నుండి దొంగిలించబడినట్లయితే అది మీకు శుభ సంకేతంగా భావించాలి. శనివారం రోజున పాదరక్షలు, చెప్పులు దొంగిలించడం లేదా దానం చేయడం చాలా శుభప్రదం. దీనితో శనీశ్వరుడి ఆశీర్వాదంతో మీ కష్టాలు త్వరగా తొలగిపోయి సుఖ సంతోషాలు లభిస్తాయని విశ్వాసం.