Shani’s Blessings: ఈ 6 అలవాట్లు ఉన్నోళ్లను శనిదేవుడు.. జీవితంలో ఎప్పుడూ ఇబ్బంది పెట్టడు!!

జ్యోతిషశాస్త్రంలో శనిని న్యాయదేవుడిగా పరిగణిస్తారు. శని దేవుడు కర్మల ఆధారంగా శుభ ,అశుభ ఫలితాలను ఇస్తాడు.

  • Written By:
  • Publish Date - August 21, 2022 / 06:00 PM IST

జ్యోతిషశాస్త్రంలో శనిని న్యాయదేవుడిగా పరిగణిస్తారు. శని దేవుడు కర్మల ఆధారంగా శుభ ,అశుభ ఫలితాలను ఇస్తాడు. శనిదేవుని వక్ర దృష్టితో ఏ వ్యక్తికైనా చెడు కాలం మొదలవుతుందని చెబుతారు. గ్రహాల మార్పు వల్ల మనిషి జీవితం కూడా ప్రభావితమవుతుంది. జాతకంలో శని స్థానం మారినప్పుడు ప్రతికూల ,అనుకూల ఫలితాలు లభిస్తాయి. అయితే ఆరు అలవాట్లు ఉన్నవాళ్లకు శని దేవుడి వల్ల ఎలాంటి ఇబ్బంది ఉండదని పండితులు అంటున్నారు.అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం..

దాన ధర్మాలు చేసేవాళ్ళు..

దాన ధర్మాలు చేసేవాళ్లు , పేదలకు సాయం చేసేవాళ్ళు, కష్టాల్లో ఉన్నవారిని ఆదుకునే వాళ్ళు అంటే శని దేవుడికి ఇష్టం. ఇలాంటి వారిపై ఎప్పటికీ శని దేవుడి కరుణ ఉంటుంది. ఇక నల్ల శెనగలు, నల్ల నువ్వులు, మినప్పప్పు, నూనె, వంట సామాన్లు, వస్త్ర సామగ్రిని దానం చేస్తే శని ప్రసన్నం అవుతాడు.

కుక్కలకు సేవ చేయడం..

కుక్కలకు సేవ చేసే వాళ్లపై శని దేవుడి కరుణ ఉంటుంది. ప్రత్యేకించి నల్ల కుక్కలకు రోటీ లేదా పాలు ఇస్తే శని బాగా సంతోష పడతాడు. ఆవాల నూనెతో చేసిన రొట్టెలను కుక్కలకు పెట్టే వాళ్లకు రాహు, కేతు దోషం లేకుండా శనిదేవుడు చేస్తాడు. ఒకవేళ ఆ దోషం ఉన్నా.. ముక్తి కలిగిస్తాడు.

గోర్లు పెరగనివ్వొద్దు..

కాళ్ళు, చేతుల గోర్లు బాగా పెంచుకునే వాళ్ళను శని దేవుడు ఇష్టపడడు. ఎప్పటికప్పుడు గోర్లను నీట్ గా కట్ చేసుకోండి. గోర్లను శుభ్రంగా ఉంచుకోండి. ఇలా చేస్తే శని భగవాన్ సంతోషించి…మీ జోలికి రానే రాడు.

శనివారం ఉపవాసం ఉండండి

శనివారం రోజున ఉపవాసం ఉంటే శని దేవుడు సంతోషిస్తారు. ఎందుకంటే.. శనివారం రోజుకు మూలం శని దేవుడే. ఆ రోజున ఉపవాసం పాటిస్తూ..మనం తినాల్సిన భోజనాన్ని పేదలు, ఆకలితో ఉన్నవాళ్లకు అందించాలి.ఇవన్నీ చూసి శని ప్రసన్నం అవుతారు.ఇలాంటి వాళ్ళ ఇంట్లో అన్నానికి, ధనానికి కొరత అనేది రాకుండా శని దేవుడు చేస్తాడు.

రావి చెట్టుకు పూజ

రావి చెట్టుకు భక్తి శ్రద్ధలతో పూజలు చేయడం లేదా రావి మొక్కలు నాటే వాళ్ళను చూసి శని సంతోషిస్తారు. మర్రి చెట్టు ముందు ఆవాల నూనెతో దీపాలు వెలిగించే వారికి కూడా శని దేవుడు ప్రసన్నం అవుతాడు.

చనిపోయిన పెద్దలకు శ్రాద్ధం..

చనిపోయిన పెద్దలకు ప్రతి సంవత్సరం తప్పకుండా శ్రాద్ధం పెట్టాలి. ఇలాంటి వారికి శని ప్రసన్నమై.. వారికి అప్పటివరకు ఉన్న కష్టాలను తొలగిస్తారు. కృష్ణ పక్షంలో మొదటి 15 రోజులను పితృ పక్షం అంటారు. ఈ వ్యవధిలో శనివారం మరియు అమావాస్య రోజున శని దేవుడికి పూజలు చేయాలి. శనివారం రోజున అమావాస్య కలిసొచ్చి.. ఆ రోజున శని దేవుడికి పూజ చేస్తే ఇంకా మంచిది. ఆ రోజున శని దేవుడికి ఎంతో ఇష్టమైన ఆవాల నూనె సమర్పించాలి. దీంతోపాటు రావి చెట్టుకు పూజ చేసి, దానికి జలాభిషేకం చేసి చుట్టూ 7 ప్రదక్షిణలు చేయాలి.