Shanidev: శనీశ్వరుడి అనుగ్రహం కలగాలనుకుంటున్నారా.. అయితే ఈ పనులు చేయాల్సిందే?

మామూలుగా చాలామంది శనీశ్వరుడి పేరు వింటే చాలు భయపడిపోతూ ఉంటారు. శనిదేవుడిని పూజించాలన్నా, ఆయన గుడికి వెళ్ళాలి అన్నా కూడా భయపడు

Published By: HashtagU Telugu Desk
Shanidev

Shanidev

మామూలుగా చాలామంది శనీశ్వరుడి పేరు వింటే చాలు భయపడిపోతూ ఉంటారు. శనిదేవుడిని పూజించాలన్నా, ఆయన గుడికి వెళ్ళాలి అన్నా కూడా భయపడుతూ ఉంటారు. కొందరు మాత్రం ప్రతీ శనివారం ఆయన ఆలయానికి వెళ్లి పూజలు చేస్తూ ఉంటారు. ఆయన అనుగ్రహం కోసం ఎన్నెన్నో పూజలు దానధర్మాలు కూడా చేస్తూ ఉంటారు. మీరు కూడా శనీశ్వరుడు అనుగ్రహం కలగాలని కోరుకుంటున్నారా. అయితే ఇది తెలుసుకోవాల్సిందే. మనకంటే తక్కువ స్థాయిలో ఉన్నవారిని ఎప్పుడూ వేధించకూడదు. బలహీనులకు అండగా నిలిచే వారికి శని అనుగ్రహం ఎల్లవేళలా ఉంటుంది.

ప్రకృతి వికాసానికి సహకరించే వారికి శని దేవుడు విశేషమైన అనుగ్రహాన్ని ఇస్తాడు. అలాగే పరిసర ప్రాంతాలను శుభ్రంగా ఉంచుతూ ప్రకృతి, పశువులకు సేవ చేయడం ద్వారా శని అనుగ్రహం పొందవచ్చు. మీ సంపాదనను ఎట్టి పరిస్థితుల్లో ఇతరుల నాశనానికి ఉపయోగించకూడదు. ఇలాంటి వారిపై శని దుష్ఫ్రభావాన్ని చూపుతాడు. వీలైనంత వరకు ఇతరులకు సేవ చేసేందుకు మీ సంపాదను ఉపయోగించాలి. ఇతరుల హక్కులను హరించాలని చూసే వారిపై శని కఠినంగా వ్యవహరిస్తారని వాస్తు పండితులు చెబుతున్నారు.
అధికారం, పదవులు, డబ్బు గురించి గర్వపడే వారిపై శని ప్రభావం ఎక్కువగా ఉంటుందని పండితులు చెబుతున్నారు.

డబ్బు అహంకారం ఉన్న వారికి శని తగిన బుద్ధి చెప్తాడని అంటున్నారు. కష్టాల్లో ఉన్న వారికి అండగా నిలిచే వ్యక్తులపై శని ఆశీస్సులు ఉంటాయని పండితులు చెబుతున్నారు. సాయం కోసం ఎదురు చూసే వారికి సహాయం అందిస్తే శని దేవుడు వారి పట్ల సానుకూలంగా ఉంటారని చెబుతున్నారు. నీటి దానం చేసినా శని దేవుడి అనుగ్రహం ఉంటుందని పండితులు చెబుతున్నారు. మరీ ముఖ్యంగా వేసవిలో జలదానం చేయడం ఎంతో ఉత్తమమని చెబుతున్నారు. మత్తు పదార్థాలు, మద్యం సేవించే వారిపై శని భగవానుడి ప్రకోపం ఉంటుందని పండితులు హెచ్చరిస్తున్నారు. అలాగే శనివారం రోజు మాంసాహారం సేవించినా శని ప్రభావం ఉంటుందట.

  Last Updated: 27 Mar 2024, 11:05 PM IST