Site icon HashtagU Telugu

Janmashtami 2025 : ధర్మస్థాపనకు మార్గదర్శకుడు శ్రీకృష్ణుడు .. ఆయన నుంచి నేర్చుకోవలసిన నాయకత్వ పాఠాలు ఇవే..!

Lord Krishna is the pioneer of establishing Dharma.. These are the leadership lessons to be learned from him..!

Lord Krishna is the pioneer of establishing Dharma.. These are the leadership lessons to be learned from him..!

Janmashtami 2025 : శ్రీకృష్ణుడు మన పురాణాలలో కేవలం దేవత స్వరూపంగా కాకుండా, ధర్మ స్థాపన కోసం పనిచేసిన ఒక పరిపూర్ణ నాయకుడిగా నిలిచాడు. ఆయన జీవితమంతా ఒక స్పష్టమైన లక్ష్యంతో సాగింది. అదీ ధర్మాన్ని స్థాపించటం. నిజమైన నాయకుడు ఎప్పుడూ తన లక్ష్యాన్ని స్పష్టంగా తెలుసుకొని, తన టీమ్‌ను అదే దిశగా నడిపిస్తాడు. పాండవులకు శ్రీకృష్ణుడు ఇచ్చిన మార్గదర్శనం ఈ విషయాన్ని సాక్షాత్కరిస్తుంది. వ్యక్తిగత ప్రయోజనాలను పక్కన పెట్టి, జట్టు శ్రేయస్సే ధ్యేయం ఇది కృష్ణుడి నాయకత్వ శైలి. ఆయనకు మంత్రీ పదవి లేదు, రాజ్యాధికారం లేదు. అయినా కూడా, తన మేధస్సుతో, ధైర్యంతో, కౌశలంతో పాండవులకు విజయపథాన్ని చూపించాడు. కురుక్షేత్ర యుద్ధంలో వ్యూహాలను రూపొందించి, క్లిష్ట సమయంలో సమర్థవంతమైన నిర్ణయాలు తీసుకోవడంలో కృష్ణుడు చూపిన నేర్పు ప్రతి నాయకుడికి పాఠంగా నిలుస్తుంది.

Read Also: Cloudburst: జ‌మ్మూ కాశ్మీర్‌లో ఆక‌స్మిక వ‌ర‌ద‌లు.. 65 మంది మృతి, 200 మంది గ‌ల్లంతు?

యుద్ధంలో గెలుపు సాధించాలంటే జట్టులో ప్రతి ఒక్కరి బలం, బలహీనతలపై స్పష్టత ఉండాలి. పాండవులు ఐదుగురు మాత్రమే అయినా, వందమంది కౌరవుల్ని ఎదుర్కొనే ధైర్యాన్ని, ఉత్సాహాన్ని కృష్ణుడు వారికి నింపాడు. వారి శక్తిని గుర్తు చేశాడు. వారి ఐక్యతను బలోపేతం చేశాడు. ఇది మాత్రమే కాదు ప్రతి నాయకుడు తన జట్టును ఒక కుటుంబంగా భావించి, వారి సామర్థ్యాన్ని గుర్తించి, వారిని ప్రేరేపించాలి అనే విషయాన్ని కృష్ణుడు తన చర్యల ద్వారా చాటిచెప్పాడు. అర్జునుడు క్షణికంగా ధర్మసంకటంలో పడినప్పుడు ఇవాళ నేను నా బంధువులపై బాణం ఎక్కించలేను అన్నప్పుడు కృష్ణుడు గీతోపదేశం ద్వారా అతనిలో మళ్లీ ధైర్యాన్ని నింపాడు. కర్మను ఫలితంపై ఆశలు లేకుండా చేయమని బోధించాడు. ఇది కేవలం ధార్మిక శిక్షణ మాత్రమే కాదు నేటి నాయకులకూ ఇది ఒక ప్రాథమిక గుణం. ఒత్తిడిలో కూడా మన తటస్థతను కోల్పోకూడదు. వ్యూహపూరితంగా, ధైర్యంగా వ్యవహరించాలి.

జరాసంధుడిని ఎదుర్కోవడంలో కూడా కృష్ణుడు చూపిన వ్యూహాత్మక తీరు, అతని నిర్ణయశక్తిని తెలియజేస్తుంది. సమస్యల నుంచి పారిపోవడం కాదు వాటిని ఎదిరించి పరిష్కరించగలగడం నాయకత్వ లక్షణం. ఈ గుణం ప్రతీ నాయకుడిలో ఉండాలి. శ్రీకృష్ణుడు ఒక గొల్లబాలుడు, రాజదూత, సారథి, తత్వవేత్తగా వివిధ పాత్రలు పోషించాడు. పరిస్థితులకు అనుగుణంగా మారుతూ, తన పాత్రను నిర్వర్తించాడు. ఇదే అసలైన నాయకత్వం పరిస్థితులను ఎదుర్కొంటూ మారే సామర్థ్యం. ప్రతి నాయకుడు తన జట్టులో నిబద్ధత, ఉత్సాహం, నైతికతలను నింపాలి. అతని మాటలు, చర్యలు జట్టును ప్రేరేపించేలా ఉండాలి. తన స్వలాభాన్ని పక్కన పెట్టి, జట్టుకు మంచి చేయాలన్న సంకల్పం కృష్ణునికి ఉన్నది. అటువంటి నాయకత్వమే నేటి సమాజంలో అవసరం. నిజమైన నాయకుడు ఎప్పుడూ ధర్మాన్ని, న్యాయాన్ని అనుసరిస్తూ, వ్యూహాత్మకంగా ముందుకు సాగుతాడు. శ్రీకృష్ణుని జీవితంలో ప్రతీ ఘట్టం దీనికి నిదర్శనం.

Read Also: MK Stalin : రాష్ట్ర అధికారాలపై కేంద్రం అరాచకానికి పాల్పడుతోంది: సీఎం స్టాలిన్‌