Site icon HashtagU Telugu

Lord Hanuman: మంగళవారం రోజు హనుమంతుడిని ప్రసన్నం చేసుకునే మార్గాలివీ

Hanuman

Hanuman

రామ భక్తుడు హనుమంతుడిది రామాయణంలో ముఖ్యమైన పాత్ర. సీతా రాముల దాసునిగా, రామ భక్తునిగా, విజయ ప్రదాతగా, రక్షకునిగా హిందూమతంలో అత్యంత భక్తి శ్రద్ధలతో కొలవబడుతున్న దేవుడు ఆంజనేయుడు. మంగళవారం మారుతికి ఇష్టమైన రోజు. ఆ రోజున వాయుపుత్రుడైన హనుమంతుడికి ఏ విధంగా పూజ చేస్తే శుభ ఫలితాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం..

మంగళవారం హనుమంతుడిని సంతోషపెట్టే మార్గాలు..

* మంగళవారం రోజున రావి చెట్టు నుంచి 11 ఆకులను తీసుకోండి. ఇవి కొంచెం కూడా చిరగనివి అయి ఉండాలి. వీటిపై కుంకుమ బియ్యంతో “శ్రీరామ్” అని రాసి.. వాటిని ఒక మాలగా కట్టి ఆంజనేయుడికి సమర్పించండి.

* మీరు హనుమంతుడి అనుగ్రహం పొందాలంటే రామనామాన్ని జపించాలి. ఎందుకంటే ఆంజనేయుడు శ్రీరామ భక్తుడు.

* హనుమంతుని ఆశీస్సులు పొందాలంటే.. మీరు మంగళవారం హనుమంతునికి ఎర్ర సింధూరం సమర్పించాలి. దీంతో మీరు రాజయోగాన్ని కూడా పొందుతారు.

* మంగళవారం నాడు బజరంగ బలికి ఎరుపు రంగు చోళాన్ని సమర్పించి, సుందరకాండను పఠించండి. ఇలా చేస్తే హనుమంతుని అనుగ్రహం మీపై ఎల్లప్పుడూ ఉంటుంది.

* హనుమంతుడిని ప్రసన్నం చేసుకోవడానికి… మంగళవారం ఉపవాసం ఉండండి. పేదలకు ఆహారం తినిపించండి. ఇలా చేయడం వల్ల మీ ఇంట్లో డబ్బుకు, ఆహారానికి ఎప్పటికీ కొరత ఉండదు.

* మీరు చెడు కలలను దూరం చేసుకోవాలంటే మంగళవారం నాడు పటికను పాదాలతో తాకి, ఆ తర్వాత దానిని నిర్జన ప్రదేశంలో విసిరేయండి.

* హనుమంతుడి ఆశీస్సులు పొందడానికి, మీరు రామరక్షా స్తోత్రాన్ని జపించండి.

* మంగళవారం, శనివారాల్లో హనుమంతునికి శెనగలను నైవేద్యంగా పెట్టండి. అలాగే అదే రోజున సుందరకాండ పారాయణం పఠించండి.

* బజరంగబళికి లవంగాలు, యాలకులు, తమలపాకు అంటే చాలా ఇష్టం. శనివారం నాడు హనుమంతునికి ఈ మూడింటిని నైవేద్యంగా పెడితే శని బాధలు తొలగిపోతాయి. అంతేకాకుండా ఆవనూనెలో లవంగాలు వేసి హనుమంతుని పూజించడం వల్ల బాధల నుంచి విముక్తి పొందొచ్చు.

*ఐదు సంఖ్య హనుమంతునికి చాల ప్రీతికరం. కనుక హనుమాన్ మందిరంలో 5 ప్రదక్షిణలు చేయడం ఉత్తమం.

*ఆలయాల్లో లభించే సింధూరం నుదుటన ధరించడం, ప్రసాదం స్వీకరించడం వల్ల ఆయురారోగ్యాలు కలుగును.

*హనుమాన్ చాలీసా పారాయణం చేసి అరటి పళ్ళు , మామిడి పళ్ళు నైవేద్యం పెట్టడం వల్ల స్వామి యొక్క అనుగ్రహం కలుగును.

 

 

Exit mobile version