Site icon HashtagU Telugu

Wednesday: విఘ్నేశ్వరుడి అనుగ్రహం కలగాలి అంటే బుధవారం రోజు ఈ పనులు చేయాల్సిందే!

Wednesday

Wednesday

మామూలుగా వారంలో ఒకరోజు ఒక్కొక్క దేవుడికి అంకితం చేయబడింది. అలా బుధవారం విఘ్నేశ్వరుడికి అంకితం చేయబడింది. ఈ రోజున గణేష్ ని భక్తిశ్రద్ధలతో ప్రత్యేకంగా పూజిస్తూ ఉంటారు. అలాగే బుధవారం రోజు కొన్ని రకాల పనులు చేయడం వల్ల విగ్నేశ్వరుడి అనుగ్రహం తప్పకుండా కలుగుతుందని భక్తులు విశ్వసిస్తూ ఉంటారు. మరి విఘ్నేశ్వరుడి అనుగ్రహం కలగాలంటే బుధవారం రోజు ఎలాంటి పనులు చేయాలో, ఎలాంటి పనులు చేస్తే ఆయన అనుగ్రహం పొందవచ్చు ఇప్పుడు మనం తెలుసుకుందాం..

బుధవారం రోజు ఉపవాసం ఉండాలట. అంటే ఉపవాసం అనగానే చాలామందికి ఆహారం తినకుండా పస్తులు ఉండటం అనుకుంటారు. కానీ అలా కాదట. రోజు మొత్తం వినాయకుడి నామం జపం ధ్యానం చేస్తూ ఆధ్యాత్మిక చింతనలో ఉండాలని చెబుతున్నారు. కేవలం విగ్నేశ్వరుడికి మాత్రమే కాకుండా ఏ దేవతకు ఉపవాసం ఉన్నా కూడా ఆ రోజు మొత్తం దైవచింతనలో ఉండాలని చెబుతున్నారు. ఇక బుధవారం రోజు ఉపవాసం ఉండడం వల్ల ఆ విఘ్నేశ్వరుడి అనుగ్రహం కలగడంతో పాటు బుధ గ్రహ దోషాలు ఏమైనా ఉంటే తొలగిపోతాయట. ఎవరికైనా జాతకంలో బుధ గ్రహం బలహీనంగా ఉండే, అలాంటివారు బుధవారం రోజు పచ్చి శనగలను పేదవారికి దానం చేయాలట. అలాగే నూలు వస్త్రాలు కూడా దానం చేయడం మంచిదని ఇలా చేస్తే బుద్ధ గ్రహ దోషాలు తగ్గుతాయని చెబుతున్నారు.

ఆర్థిక సమస్యలు అప్పులతో సతమతమవుతున్న వారు బుధవారం రోజు ఉపవాసం ఉండి వినాయకుడి సమక్షంలో కూర్చొని వినాయక స్తోత్రం పాటించాలట. ఈ విధంగా చేస్తే ఆర్థిక బాధలు తగ్గుముఖం పడతాయని చెబుతున్నారు. బుధవారం రోజు గణపతి ధ్యానం, జపం చేయడం కూడా సానుకూల ఫలితాలు ఇస్తుందని చెబుతున్నారు. అయితే ఇందుకోసం “ఓం గం గణపతయే నమః” అనే మంత్రాన్ని కానీ “శ్రీ గణేశాయ నమః” అనే మంత్రాన్ని కానీ జపించాలట. ఈ నామాన్ని 108 సార్లు అంతకంటే ఎక్కువ సార్లు జపం చేయడం వల్ల మంచి ఫలితాలు కనిపిస్తాయని చెబుతున్నారు. వినాయకుడు అనుగ్రహం ఉండాలంటే 21 బుధవారాలు ప్రతి బుధవారం వినాయకుడికి గరిక సమర్పించాలట. గరికను దుర్వా అని కూడా అంటారు. ఈ గరిక అంటే వినాయకుడికి చాలా ప్రీతి. ఇలా 21 బుధ వారాలు సమర్పిస్తే జీవితంలో వచ్చే సమస్యలన్నీ తొలగిపోతాయని చెబుతున్నారు.