Site icon HashtagU Telugu

Lord Ganesha: కలలో వినాయకుడి కనిపిస్తున్నాడా.. దేనికి సంకేతమో తెలుసా?

Lord Ganesha

Lord Ganesha

సాధారణంగా మనం పడుకున్నప్పుడు ఎన్నో రకాల కలలు పీడ కలలు వస్తూ ఉంటాయి. కొంతమంది పీడ కలలు వచ్చినప్పుడు భయపడుతూ ఉంటారు. ఆ కలలు నిజమవుతాయేమో అని ఆందోళన చెందుతూ ఉంటారు. అయితే మామూలుగా మనం పడుకున్నప్పుడు పుట్టుక, చావు,ప్రకృతి,దేవుళ్ళు ఇలా ఎన్నో రకాల కలలు వస్తూ ఉంటాయి. అయితే స్వప్న శాస్త్ర ప్రకారం కలలు భవిష్యత్తును సూచిస్తాయని చెబుతూ ఉంటారు. ఒకవేళ కలలో వినాయకుడు కనిపిస్తే అది దేనికి సంకేతమో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. కలలో గణేష్ విగ్రహాన్ని చూడడం శుభప్రదం అని చెప్పవచ్చు.

కలలో వినాయక విగ్రహం కనిపిస్తే త్వరలోనే శుభవార్తలు అందుకోబోతున్నారని అర్థం. అలాగే ఇంట్లో శుభకార్యాలు లేదా మతపరమైన పనులు జరుగుతాయని అర్థం. అయితే ఆ కల గురించి ఎవరికీ చెప్పకూడదు. అలాగే కలలో శివ కుటుంబం కనిపిస్తే శుభసూచకంగా భావించాలి. అలా కనిపిస్తే త్వరలోనే మీరు కష్టాల నుండి విముక్తి పొందబోతున్నారని అర్థం. అలాగే మనకు రావాల్సిన డబ్బు రావడంతో పాటు అనుకున్న పనులు కూడా సక్రమంగా జరుగుతాయి. అలాగే గణేశుడు, ఎలుకపై స్వారీ చేస్తున్నట్లు కలలో కనిపిస్తే ఏదైనా యాత్రకు వెళ్ళే అవకాశం ఉంటుంది. అలాగే కలలో విఘ్నేశ్వరుని పూజిస్తున్నట్లు వస్తే అది శుభసంకేతంగా భావించవచ్చు.

త్వరలోనే మీరు కోరిన కోరికలు నెరవేరబోతున్నాయని అర్థం. అలాగే ఏదైనా పనులు అనుకున్నప్పుడు ఆటంకాలు ఏర్పడి నిలిచిపోతే వెంటనే ఆ పనులు పూర్తవుతాయి. అలాగే కలలో వినాయకుడి నిమజ్జనం చేస్తున్నట్లు వస్తే అది అశుభసంకేతంగా భావించాలి. అయితే త్వరలోనే మీరు కొన్ని ఇబ్బందులను ఎదుర్కోబోతున్నారని అర్థం. అలాగే మీరు ఆర్థికంగా కూడా నష్టపోవచ్చు. అయితే బ్రహ్మ ముహూర్తంలో కనిపించే గణేషుడు కల చాలా పవిత్రమైనదిగా పరిగణించాలి.