Lord Balaji: తిరుమల శ్రీవారికి ఎన్నిరకాల నైవేద్యాలు సమర్పిస్తారో తెలుసా..?

శ్రీ వేంకటేశ్వరస్వామి...తిరుమల శ్రీవారిగా అశేష భక్తజనం కొలుచుకునే ఏడుకొండవాడిగా ఈ భూమిపైన అత్యంత శక్తివంతమైన దైవంగా భావిస్తారు.

  • Written By:
  • Publish Date - February 17, 2022 / 07:00 AM IST

శ్రీ వేంకటేశ్వరస్వామి…తిరుమల శ్రీవారిగా అశేష భక్తజనం కొలుచుకునే ఏడుకొండవాడిగా ఈ భూమిపైన అత్యంత శక్తివంతమైన దైవంగా భావిస్తారు. ఆ శ్రీనివాసుడిని దర్శించుకుంటే..జన్మ ధన్యం అయినట్లేనని భావిస్తారు. పేద, ధనిక అని తేడా లేకుండా అందర్నీ ఆదరించే ఈ వేంకటేశ్వరస్వామి ఆలయానికి వెళ్లడం అంటే మనం పుణ్యం చేసుకున్నట్లయితే అని చెప్పవచ్చు. చాలామంది తిరుమలకు వెళ్లాలని మనసులో అనుకుంటారు. కానీ వడ్డీకాసుల వాడి అనుగ్రహం లేకుంటే మీరెన్ని ప్రయత్నాలు చేసినా కొండ ఎక్కలేరు.

ఇక కలియుగ ప్రత్యక్ష దైవం ఆ శ్రీనివాసుడి…మహాప్రసాదం లడ్డు గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. కానీ ఆ శ్రీనివాసుడికి సమర్పించే నైవేద్యాలు మనకు తెలియనివి ఇంకా ఎన్నో ఉన్నాయి. అసలు ఏడుకొండలవాడికి ఎన్ని రకాల నైవేద్యాలు సమర్పిస్తారో తెలుసుకుందాం.

తిరుమల శ్రీవారు అలంకార ప్రియుడు మాత్రమే కాదు…ఆహార ప్రియుడు కూడా. బంగారంతో మెరిసిపోయే ఆనంద నిలయంలో కొలువైన శ్రీవారికి లడ్డూతోపాటు రకరకాల ఆహారా పదార్థాలను నైవేద్యంగా సమర్పిస్తారు. వేంకటేశ్వరస్వామికి ప్రతిరోజూ సమర్పించే ప్రసాదాల్లో చాలా రకాలు ఉంటాయి. వడ, అప్పాలు, లడ్డు ఇవి మాత్రమే సమర్పిస్తారని మనందరికీ తెలుసు. కానీ దోశ, జిలేబీ, మురుకు, పోలీలను కూడా స్వామివారికి నైవేద్యంగా సమర్పించడానికి ప్రత్యేకంగా తయారు చేస్తారన్న విషయం చాలామందికి తెలియదు.

ప్రపంచవ్యాప్తంగా తిరుమల లడ్డు చాలా ఫేమస్. కానీ స్వామివారి స్పెషల్ నైవేద్యాల గురించి సామాన్య భక్తులకు తెలియదు. కానీ ఏదోక సందర్భంలో వాటిని రుచిచేసే ఉంటారు. కొంతమంది ప్రముకులు స్వామివారికి త్రికాల నైవేద్యం సమర్పిస్తారు. నైవేద్య సమయాలు మొదటి గంట, రెండవ గంట, మూడవ గంటగా పిలుస్తుంటారు. గురు, శుక్రవారాల్లో మాత్రమే స్వామివారి నైవేద్య సమయాల్లో మార్పులు ఉంటాయి. మిగతా రోజుల్లో ఎలాంటి మార్పు ఉండదు.

స్వామివారికి ప్రసాదాలు నివేదించడానికి పురాతన కాలంలో అనేకమంది రాజులు మణులు, మాణిక్యాలను సమర్పించినట్లు చరిత్ర చెబుతోంది. తిరుమల ఆలయ గోడల మీద ఏ రాజవంశానికి చెందిన రాజులు…ప్రసాదాల కోసం ఎంత డబ్బులు ఇచ్చారన్న విషయాన్ని శిలాశాసనాల్లో చెక్కించారు. అవి నేటికి అలాగే ఉన్నాయి. ఇక శ్రీ భగవత్ రామానుజాచార్యులవారు నిర్దేశించిన విధంగానే పూజా నియమాలు జరుగుతూ వస్తున్నాయి. ఇప్పటికూడా వారే స్వామివారికి నైవేద్యాలు సమర్పిస్తున్నారు.

ఇక జీవితంలో ఒక్కసారైనా ఈ తిరుమల శ్రీవారికి సమర్పించే నైవేద్యాలను రుచిచూడాలని చాలామంది భక్తులు కోరుకుంటారు.