Site icon HashtagU Telugu

Camphor: ఇంట్లో కర్పూరం వెలిగించడం వల్ల కలిగే ఫలితాలు ఇవే?

Camphor

Camphor

మామూలుగా చాలామంది ఇంట్లో పూజ చేసిన తర్వాత కర్పూరాన్ని వెలిగిస్తూ ఉంటారు. మరి కొంతమంది మాత్రం వెలిగించరు. కానీ చాలామందికి తెలియని విషయం ఏమిటంటే కర్పూరాన్ని వెలిగించడం వల్ల ఆరోగ్యపరంగానే కాకుండా ఆధ్యాత్మికంగా కూడా ఎన్నో లాభాలు ఉన్నాయి. అలాగే ఇంట్లో నెగటివ్ ఎనర్జీ అంతా పోయి పాజిటివ్ ఎనర్జీ రావాలంటే ఇంట్లో తప్పకుండా కర్పూరాన్ని వెలిగించాల్సిందే. కర్పూరం అద్భుతమైన లక్షణాలు కలిగి ఉంటుంది. కర్పూరం వాసన, పొగ వలన దుష్టశక్తులు తొలగిపోతాయి. ప్రతికూల శక్తిని తొలగించే శక్తి కర్పూరానికి ఉంది. కర్పూరం పొగ చుట్టూ దరిదాపుల్లో ఉన్న దుష్ట శక్తులు పారిపోవడంతో పాటు ఏవైనా చిన్న చిన్న క్రిమి కీటకాలు ఉన్నా కూడా నశిస్తాయి.

కర్పూరాన్ని దేవుడి వ‌ద్ద‌ వెలిగించి మామూలుగా హారతి పాట పాడడం లేదంటే శ్లోకాలని చదవడం వంటివి చేస్తూ ఉంటాం. కానీ ఇంటికి ఇన్ని లాభాలు కలుగుతాయని చాలా మందికి తెలియదు. ఇంటి వాతావరణం కర్పూరంతో శుద్ధి చేయబడుతుంది. దుష్ట శక్తులు తొలగిపోతాయి. కర్పూరం ఇంట్లో వెలిగిస్తే సంపద బాగా పెరుగుతుంది. నెగెటివ్ ఎనర్జీ వెళ్ళిపోతుంది. కర్పూరాన్ని వెలిగించినప్పుడు వచ్చే పొగ నెగెటివ్ ఎనర్జీని సులభంగా తొలగించగలదు.

కర్పూరం వలన నెగెటివ్ ఎనర్జీ పూర్తిగా తొలగి పోతుంది. మంచి జరుగుతుంది. ఆహ్లాదకరంగా ఉంటుంది. ప్రశాంతత లభిస్తుంది. ఎంతో హాయిగా ఉండొచ్చు. ఏ సమస్య కూడా ఉండదు. అలాగే దీని వల్ల కండ్ల కలకల సమస్య నుండి కూడా బయటపడవచ్చు. అప్పుడప్పుడు మనకి మనసులో బాధ లేదంటే ఇంట్లో ఏదో ఒక సమస్య వలన చికాకు వంటివి కలుగుతూ ఉంటాయి.