Darbhas: మన చుట్టూ ఉండే మొక్కలలో తులసి, దర్భలు, బిల్వదళం వంటి వాటిని అత్యంత పవిత్రమైనవిగా భావిస్తూ ఉంటారు. వీటిని దేవుళ్ళ పూజలలో కూడా వినియోగిస్తూ ఉంటారు. అయితే వీటిలో దర్భలు గడ్డి జాతికి చెందినవి. శ్రీరామచంద్రుడి స్పర్శతో పునీతమైన వీటిని పవిత్ర కార్యాలకు వినియోగిస్తూ ఉంటారు. కాగా దర్భగడ్డికి ఉష్ణశక్తి ఎక్కువగా ఉంటుంది. ఇవి జలాన్ని శుభ్రపరుస్తాయి. అలాగే విషానికి కూడా విరుగుడుగా పనిచేస్తాయి. అందుకే గ్రహణకాలంలో వ్యాపించే విషవాయువులను, క్రిములను నశింపచేసేందుకు దర్భలను ఎక్కువగా వినియోగిస్తారు.
ముఖ్యంగా ఉప్పు కలిపిన పదార్థాల్లో దర్భలు తప్పనిసరిగా ఉంచాలని పండితులు సైతం చెబుతున్నారు. కాగా దర్భలను సంస్కృతంలో అగ్ని గర్భం అని పిలుస్తారు. వీటిని ఇవి కుంభాభిషేకాల్లో, యాగశాలల్లో కలశాల్లోను, బంగారు, వెండి తీగలతో పాటుగా ధర్భలను కూడా చుడతారు. అంటే అత్యంత విలువైన బంగారాన్ని మించిన శుద్ధి దర్భ సొంతం అని అర్ధం. కాగా దర్భలు మూడు రకాలు అవి స్త్రీ, పురుష ,నపుంసక. పురుష జాతి దర్భలు అడుగు నుంచి చివరి వరకూ సమానంగా ఉంటాయి. ఇక స్త్రీ దర్భలు పై భాగంలో దళసరిగా ఉంటాయి. ఇకపోతే నపుంసక జాతి ధర్భలు అంటే అడుగున దళసరిగా ఉంటాయి.
అలాగే దర్భల పై భాగం శివుడి, మధ్య భాగం శ్రీ మహావిష్ణువు, చివరి భాగం బ్రహ్మదేవుడి నివసిస్తారు. పితృదేవతలకు తర్పణాలు విడిచేటప్పుడు శుద్ధికోసం దర్బతోనే ఇస్తారు. భగవంతుడికి ఇచ్చే నీటిని దర్భ కొసలతో ఇస్తారు. ఆగు పితృదేవతలను తలుచుకుని ఇచ్చే దర్భలను మడిచి కొసలతో ఇస్తారన్న తెలిసిందే. అదేవిధంగా భగవంతుడి ఆరాధన, జపం, హోమం, దానం, తర్పణం వంటి కార్యాలతో దర్భలతో చేసిన పవిత్రం అనే ఉంగరాన్ని తప్పనిసరిగా ధరిస్తారు. ధర్భ గడ్డిలో పులుపు, క్షార గుణాలు ఉండడం వల్ల రాగి విగ్రహాలను బూడిద దర్భలు ఉపయోగించి శుభ్రపర్చాలని శిల్ప శాస్త్రం చెబుతోంది.
ఇలా చేయడం వల్ల శిల్పాల్లోని ఆవాహన మంత్ర శక్తి తరగకుండా చాలా రోజులు ప్రకాశవంతంగా ఉంటాయని అంటున్నారు. ఆదివారం రోజు కోసిన దర్భలను ఆ వారం మొత్తం ఉపయోగించవచ్చు. అమావాస్య రోజు కోసిన దర్భలు ఒక నెల రోజుల వరకు ఉపయోగించవచ్చట. పౌర్ణమి రోజు కోసిన దర్భలను 15 రోజులు ఉపయోగించవచ్చట.శ్రావణ మాసంలో కోసిన దర్భలు ఏడాది మొత్తం వినియోగించవచ్చని చెబుతున్నారు. భాద్రపద మాసంలో తీసిన దర్భలు ఆరు మాసాలు వినియోగించవచ్చట.
Darbhas: గ్రహణ కాలంలో దర్భలు ఉపయోగించడం వెనుక ఉన్న కారణాల గురించి మీకు తెలుసా?

Darbhas