Management Guru Lord Hanuman : హనుమాన్..ది గ్రేట్ మేనేజ్మెంట్ గురూ

వాయు పుత్రుడు వీర హనుమాన్.. ధైర్యానికి, గుణానికి, భక్తికి, ధర్మానికి ఆదర్శ చిహ్నం. ఆయన జీవితం అందరికీ ఆదర్శప్రాయం. హనుమంతుడు నైపుణ్యం కలిగిన గొప్ప మేనేజర్(Management Guru Lord Hanuman).

  • Written By:
  • Updated On - May 19, 2023 / 10:59 AM IST

వాయు పుత్రుడు వీర హనుమాన్.. ధైర్యానికి, గుణానికి, భక్తికి, ధర్మానికి ఆదర్శ చిహ్నం. ఆయన జీవితం అందరికీ ఆదర్శప్రాయం. హనుమంతుడు నైపుణ్యం కలిగిన గొప్ప మేనేజర్(Management Guru Lord Hanuman). మనస్సు, మాట, పని అనే మూడు విషయాల్లో ఆంజనేయుడు చక్కటి బ్యాలెన్స్ పాటించారు. రామాయణాన్ని నిశితంగా చదివితే మనకు ఈవిషయం ఇట్టే అర్ధమైపోతుంది. సరైన సమయంలో సరైన పని చేయడం అనేది హనుమాన్ అద్భుత లక్షణం. హనుమాన్ జీవితం నుంచి ఇలాంటి ఇంకెన్నో మేనేజ్మెంట్ టిప్స్(Management Guru Lord Hanuman), లైఫ్ స్కిల్స్ నేర్చుకోవచ్చు. అవేంటో ఒకసారి చూద్దాం..

* అంకితభావం, నిస్వార్థ నిబద్ధత

హనుమంతుడు శ్రీరామునికి నిస్వార్థ భక్తుడు. ఈ భక్తి వల్లే ఆయనకు ఇతర దేవతల గౌరవం కూడా లభించింది. అదే విధంగా మీరు మీ టార్గెట్, మీ కెరీర్ పై పూర్తి అంకితభావంతో పనిచేయాలి. మీ వృత్తి పట్ల అంకితభావం, నిస్వార్థ నిబద్ధత కలిగి ఉండాలి. ఇవి మీకు దీర్ఘకాలంలో గొప్ప రాబడిని సాధించిపెడతాయి.

* పర్ఫెక్షన్, హార్డ్ వర్క్

హనుమంతుడు ఏ పనినైనా సమర్థవంతంగా, పర్ఫెక్ట్ గా చేసేవారు. సుగ్రీవుడికి సహాయం చేయాలని భావించి .. ఆయనను తీసుకెళ్లి శ్రీరామునికి పరిచయం చేశారు. ఇక తానూ ఆరాధించే శ్రీరామునికి సహాయం చేయడానికి తన అన్ని శక్తియుక్తులను ఉపయోగించాడు. లంకకు వెళ్లే క్రమంలో సముద్రం దాటడానికి ఆంజనేయుడు ఎంత ధైర్యాన్ని ప్రదర్శించారో మనకు తెలుసు. మీరు కూడా జీవితంలో పైకి రావాలంటే ధైర్యంగా ముందుకు సాగాలి. చేసే పనిని పర్ఫెక్ట్ గా చేయాలి. మిమ్మల్ని నమ్ముకున్న సంస్థ కోసం డెడికేటెడ్ గా శ్రమించాలి. మీ అన్ని స్కిల్స్ ను వాళ్ళ కోసం ఉపయోగించాలి.

* విజన్

హనుమంతుడు దూరదృష్టి కలవాడు. అందుకే సుగ్రీవుడిని శ్రీరామునికి పరిచయం చేశాడు. ఆ తరువాత విభీషణుడిని శ్రీరామునికి పరిచయం చేశాడు. సుగ్రీవుడు శ్రీరాముని సహాయంతో వాలిని సంహరిస్తే.. శ్రీరాముడు విభీషణుని సహాయంతో రావణుడిని సంహరించాడు. హనుమంతుని దూరదృష్టి వల్లే ఇది సాధ్యమైంది.

also read : Astrology : హనుమాన్ పూజకు శని, మంగళవారాలే ఎందుకు అనుకూలం..?

* నాయకత్వ లక్షణాలు

హనుమంతుడు మొత్తం వానర సైన్యానికి కమాండర్. ఆయన లీడర్ షిప్ క్వాలిటీస్ కలిగిన వ్యక్తి. ఆయన అందరినీ తన వెంట లంకకు తీసుకెళ్లగలనని నమ్మాడు. కష్టాల్లోనూ నిర్భయంగా.. ధైర్యంగా ముందడుగు వేశాడు. అందరి సలహాలను వింటూ హనుమాన్ సాగించిన ప్రయాణం స్ఫూర్తిదాయకం. మనపై మనకు నమ్మకం ఉండాలి. అప్పుడే ఇతరులు మనల్ని నమ్ముతారు. ఈక్రమంలో అతి విశ్వాసాన్ని దరి చేరనివ్వకూడదు. ఇతరులు ఇచ్చే సలహాలలో మంచివి ఏవైనా ఉంటే వాటిని కూడా పరిగణలోకి తీసుకోండి.

* కంఫర్ట్ జోన్‌ను విడిచిపెట్టడం

మనం కెరీర్‌ లో డెవలప్ కావాలంటే.. జీవితంలో ఎదగాలంటే కంఫర్ట్ జోన్‌ ను వదిలిపెట్టాలి. హనుమంతుడు ఒక రాజు కుమారుడు. అయినప్పటికీ.. ఆయన సుగ్రీవుడి దగ్గర కార్యదర్శిగా పని చేయడం ప్రారంభించాడు. ఈ పోస్ట్‌లో ఆయన వివిధ పెద్ద పాత్రలను సులభంగా పోషించాడు. రాముడి హృదయంలో స్థానాన్ని సంపాదించాడు. కాబట్టి మనం కూడా మన యజమానికి అత్యంత ప్రియమైన ఉద్యోగిగా మారాలి.

* మీ ఆదర్శాలపై రాజీ పడకండి

లంకలో అశోక్ వాటికలో హనుమంతుడు, మేఘనాథ్ మధ్య యుద్ధం జరిగినప్పుడు.. హనుమంతుడిపైకి మేఘనాథ్ “బ్రహ్మాస్త్రం” ప్రయోగించాడు. అయితే హనుమంతుడు ఆ “బ్రహ్మాస్త్రాన్ని” విరగ్గొట్టాడు. హనుమంతుడికి ఆ టైంలో “బ్రహ్మాస్త్రం” కనిపించలేదు.. కేవలం సీతమ్మను లంక నుంచి తీసుకెళ్లాలనే లక్ష్యం మాత్రమే కనిపించింది. ఆ లక్ష్యం ముందు “బ్రహ్మాస్త్రం” కూడా పనిచేయలేదు. మనం ఆదర్శాల విషయంలో రాజీపడకుండా పోరాటం సాగించాలనే గొప్ప సందేశం ఇందులో దాగి ఉంది.