Laughing Buddha: ఇలాంటి లాఫింగ్ బుద్ధ మీ ఇంట్లో ఉంటే చాలు.. అదృష్టం పట్టిపీడిస్తుంది?

చాలామందికి లాఫింగ్ బుద్ధ అంటే చాలా ఇష్టం. దానికి తోడు లాఫింగ్ బుద్ధ ఎక్కడ ఉంటే అక్కడ ఐశ్వర్యం ఆనందం రెండూ ఉంటాయని చెబుతూ ఉంటారు. చాలామంది ఆచాలామందికి లాఫింగ్ బుద్ధ అంటే చాలా ఇష్టం. దానికి తోడు లాఫింగ్ బుద్ధ ఎక్కడ ఉంటే అక్కడ ఐశ్వర్యం ఆనందం రెండూ ఉంటాయని చెబుతూ ఉంటారు. చాలామంది ఆ

  • Written By:
  • Publish Date - June 11, 2023 / 07:30 PM IST

చాలామందికి లాఫింగ్ బుద్ధ అంటే చాలా ఇష్టం. దానికి తోడు లాఫింగ్ బుద్ధ ఎక్కడ ఉంటే అక్కడ ఐశ్వర్యం ఆనందం రెండూ ఉంటాయని చెబుతూ ఉంటారు. చాలామంది ఆర్థికంగా బాగా ఉండటం కోసం లాఫింగ్ బుద్ధను ఇంట్లో ఉంచుకుంటూ ఉంటారు. అయితే లాఫింగ్ బుద్ధలో ఎన్నో రకాల లాఫింగ్ బుద్ధలు ఉన్నాయి అన్న విషయం మనం అందరికి తెలిసిందే. అందుకే ఒక్కొక్క లాఫింగ్ బుద్ధ ప్రదేశంలో పెట్టడం వల్ల అంత శుభమే అని భావిస్తూ ఉంటారు. అయితే ఈ బొమ్మను ఎవరికి వారు కొనుక్కోకూడదు.

ఎవరైనా గిఫ్ట్ ఇచ్చింది తీసుకుంటే చాలా మంచి జరుగుతుంది. కాగా చైనాలో హొటై పేరుతో బౌద్ధ బిక్షువుగా తిరిగేవాడట లాఫింగ్ బుద్ధ. భుజాన జోలె, చేతిలో బిక్షాప్రాతతో ఉండే ఆయన వద్దకు పిల్లలు వచ్చి ఏమడిగినా జోలె నుంచి తీసిచ్చేవాడట. ఉదయాన్నే ఆయన ముఖం చూసిన వారికి ఆ రోజంతా మంచే జరిగేదట. జపాన్‌లో లాఫింగ్‌ బుద్ధాను ఏడుగురు అదృష్ట దేవుళ్లలో ఒకరుగా పూజిస్తారు. థాయ్‌లాండ్‌ లోనూ భలే క్రేజ్ ఉంది. లాఫింగ్‌ బుద్ధను సంస్కృతంలో మైత్రేయ అని పిలుస్తారు. ఎటువంటి లాఫింగ్ బుద్ధ తీసుకున్నా కూడా ఇంచక్కా నవ్వుతూ ఉంటుంది.
నిల్చున్న లాఫింగ్ బుద్ధ.. రెండు చేతులు పైకెత్తి వాటిలో బంగారు బంతులు మోస్తూ కనిపించే బుద్ధ ప్రతిమ ఇంట్లో ఉంటే ఆరోగ్యప్రదాతగా భావిస్తారు.

ఇలాంటి విగ్రహం ఇంట్లో ఉంటే దీర్ఘాయుష్షు కలుగుతుంది. అయితే ఈ ప్రతిమను తూర్పు దిశకు అభిముఖంగా ఉంచితే మంచిది. బంగారు నాణేలతో కూర్చున్న లాఫింగ్ బుద్ధ బంగారు నాణేలతో తిష్టవేసి కూర్చున్న లాఫింగ్‌ బుద్ధా ఇంట్లో ఉంచితే అదృష్టం దరిద్రం పట్టినట్టు పడుతుంది. ఈ ప్రతిమ ఆరోగ్యాన్ని ప్రసాదించడంతో పాటు సిరిసంపదలు సమృద్ధిగా కలిగిస్తుంది. కాబట్టి ఈ ప్రతిమను వాయవ్య దిశలో లేదా దక్షిణాభి ముఖంగా ఉంచడం మంచిది. అయితే ఇంట్లో లేదా ఆఫీస్ లలో ఈ విగ్రహాన్ని ఎక్కడ పెట్టిన కూడా ఎట్టి పరిస్ధితిలోనూ కింద పెట్టకూడదు. అలా చేస్తే అనర్థాలు జరిగే ప్రమాదం ఉంది. ఆఫీసులో, ఇళ్లలో ఎక్కడైనా సరే ద్వార బంధానికి దగ్గర్లో, కానీ ఎదురుగా గానీ సరైన స్ధలాన్ని నిర్ణయించి భూమి కనీసం అడుగున్నర ఎత్తులో ఉంచాలి.