Lunar Eclipse 2022: అక్టోబర్ 25న పాక్షిక సూర్యగ్రహణం ఏర్పడిన విషయం తెలిసిందే. అయితే ఇది ఈ ఏడాది చివర సూర్యగ్రహణం. సరిగ్గా ఇది జరిగిన 15 రోజుల తర్వాత అంటే నవంబర్ 8వ తేదీన ఈ ఏడాది చివరి చంద్రగ్రహణం ఏర్పడబోతోంది. అంటే కార్తీక మాసం పౌర్ణమి రోజున చంద్రగ్రహణం ఏర్పడనుంది. ఈ ఏడాది చివరి చంద్రగ్రహణం ఇది. అయితే ఈ చంద్రగ్రహణం భారతదేశంలో 5:30 ప్రారంభమై 6:19 వరకు ఉంటుంది. అంటే దాదాపు గంటన్నర పాటు ఈ చంద్రగ్రహణం ఏర్పడుతుంది.
అయితే ఈ చంద్రగ్రహణం భారతదేశంతో పాటు ఉత్తర అమెరికా, దక్షిణ అమెరికా, ఆస్ట్రేలియా, ఆసియా, ఉత్తర పసిఫిక్ మహాసముద్రం, హిందూ మహాసముద్రం ప్రదేశాలలో కూడా కనిపించనుంది. అయితే ఇలా 15 రోజుల్లోనే రెండు గ్రహణాలు సంభవించడం అన్నది అశుభ ఫలితాలను ఇస్తుంది అంటున్నారు జ్యోతిష్యులు. 15 రోజుల వ్యవధిలోని వచ్చి ఈ రెండు గ్రహణాలు ప్రపంచంపై ప్రభావాన్ని చూపుతాయని నిపుణులు అంటున్నారు.
దీనివల్ల ప్రకృతి వైపరీత్యాలు లేదంటే విశాల మధ్య ఉద్రిక్తతలు, రెండు దేశాల మధ్య సరిహద్దు వివాదాలు తలెత్తవచ్చు అని చెబుతున్నారు. ఈ గ్రహణం మన జీవితాన్ని చాలా ప్రతికూలంగా ప్రభావితం చేసే ఒక సంఘటన అని చెప్పవచ్చు. అందుకే ఈ గ్రహణం చెడు ప్రభావాలు ప్రజలపై పడకుండా ఉండేందుకు అనేక రకాల నివారణలను సూచించారు. ఈ గ్రహణ సమయంలో ఆలయం తలుపులు మూసివేస్తారు. అలాగే ఎటువంటి పూజలు కూడా నిర్వచించరు. ఈ గ్రహణం సమయంలో తినకుండా ఉండటం మాత్రమే కాకుండా గ్రహణానికి ముందుగా చేసిన ఆహారాన్ని కూడా తినకూడదు. చంద్రగ్రహణం తరువాత స్నానం చేసి ఇంట్లో గంగాజలాన్ని చల్లుకోవాలి అని నిపుణులు సూచిస్తున్నారు.